‘పండగ’ డేట్ వచ్చేసింది

సంక్రాంతి పండగ సినిమాల మీమాంస అలా వుండగానే, మారుతి డైరక్షన్ లోని ప్రతిరోజూ పండగే సినిమా డేట్ వచ్చేసింది. డిసెంబర్ 20న సినిమా విడుదల అంటూ అధికారికంగా ప్రకటించేసారు. యువి/గీతా నిర్మించే ఈ సినిమాకు…

సంక్రాంతి పండగ సినిమాల మీమాంస అలా వుండగానే, మారుతి డైరక్షన్ లోని ప్రతిరోజూ పండగే సినిమా డేట్ వచ్చేసింది. డిసెంబర్ 20న సినిమా విడుదల అంటూ అధికారికంగా ప్రకటించేసారు. యువి/గీతా నిర్మించే ఈ సినిమాకు బన్నీవాస్, యువి వంశీ నిర్మాతలు. సాయితేజ్-రాశీఖన్నా, రావు రమేష్, మురళీశర్మ, సుహాస్, మహేష్ తదితరులు నటిస్తున్నారు.

వెంకీ-నాగ చైతన్యలు నటించిన వెంకీమామ సినిమా డైలమా కొనసాగుతుంటే, ఎక్కడ తమ సినిమా మీదకు వస్తుందో అని, ప్రతిరోజు పండగే సినిమా యూనిట్ చకచకా అడుగుముందుకు వేసి డేట్ అనౌన్స్ చేసేసింది. దీంతో ఇప్పుడు వెంకీమామ పరిస్థితి ఇరకాటంలో పడింది. డిసెంబర్ 13 (వెంకీ బర్త్ డే) 20 లేదా జనవరి 14/15 డేట్ లను పరిశీలిస్తూ వున్నారు.

ప్రతి డేట్ కు ఏదో ఒక సమస్య. 13న వస్తే ఎగ్జామ్స్, 20న వస్తే దబాంగ్ 3 సినిమా వల్ల మల్టీ ఫ్లెక్స్ స్క్రీన్ ల సమస్య, పండగకు వద్దామంటే థియేటర్ల సమస్య. మరి వెంకీమామ ఏం చేస్తుందో చూడాలి.

అప్పుడు బ్లాక్ మెయిలర్.. ఇప్పుడు చీటర్.. రవి ప్రకాష్!