ప్రధానిని కలవబోతున్న ‘సైరా’?

తన తాజా సినిమా 'సైరా నరసింహారెడ్డి' ప్రమోషన్ కోసం ఢిల్లీ చేరారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ ను, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి తన సినిమాను వీక్షించాల్సిందిగా…

తన తాజా సినిమా 'సైరా నరసింహారెడ్డి' ప్రమోషన్ కోసం ఢిల్లీ చేరారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ ను, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి తన సినిమాను వీక్షించాల్సిందిగా కోరిన చిరంజీవి ఇప్పుడు ఢిల్లీ పెద్దలకు తన సినిమా గురించి తెలియజేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలవడం జరిగిందట.

ప్రత్యేక షో ఏర్పాటు చేసి ఉప రాష్ట్రపతికి ఆ సినిమాను చూపబోతున్నారట. వెంకయ్య నాయుడుతో కలిసి ఆ సినిమాను చిరంజీవి కూడా వీక్షించనున్నారట. అలాగే ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, ప్రధానమంత్రి నరేంద్రమోడీని కూడా చిరంజీవి కలుస్తారని సమాచారం. వారికి కూడా సినిమా గురించి వివరించి, వీక్షించాల్సిందిగా కోరనున్నట్టుగా తెలుస్తోంది.

మొత్తానికి సినిమాతో చాలామంది రాజకీయ నేతలనే కలుస్తున్నారు చిరంజీవి. రాజకీయాల్లోకి వచ్చి వైదొలిగిన ఆయన తన సినిమాతో మొత్తం రాజకీయ నేతలతో సమావేశం అవుతుండటం గమనార్హం!

అప్పుడు బ్లాక్ మెయిలర్.. ఇప్పుడు చీటర్.. రవి ప్రకాష్!