సైరా థియేటర్ల మీద జీఎస్టీ టాస్క్ ఫోర్స్ కన్నుపడింది. ఈస్ట్ గోదావరిలో సైరా థియేటర్ల మీద జీఎస్టీ టాస్క్ ఫోర్స్ తనిఖీలు ప్రారంభించింది. డిసిఆర్ లు పక్కాగా, అన్నిరోజులకు కలిపి స్టేట్ మెంట్ కింద ఇవ్వమని థియేటర్ యాజమాన్యాలను ఆదేశించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి ఈస్ట్ గోదావరి జిల్లాలో మాత్రమే ఇవి జరుగుతున్నాయని తెలుస్తోంది. మిగతా జిల్లాల సంగతి తెలియలేదు. ఈస్ట్ గోదావరి జిల్లాలో దాదాపు పది కోట్లకు కాస్త తక్కువగా సైరా హక్కులు విక్రయించారు. ఇక్కడ యాభై లక్షలకు పైగానే బయ్యర్ కు నష్టం వస్తుందని అంచనాలు వున్నాయి. ఇలాంటి నేపథ్యంలో జీఎస్టీ లెక్కలు తీయడం అంటే ఇది అనుకూలమా, ప్రతికూలమా అన్నది తెలియాల్సి వుంది.
ఇదిలావుంటే సాహో విడుదల తరువాత కూడా ఇదే విధంగా లెక్కలు ఆరా తీసారని, అయితే ఆ వార్తలు బయటకు రాలేదని తెలుస్తోంది. మొత్తంమీద జీఎస్టీ వచ్చిన తరవాత పెద్ద సినిమాలకు కాస్త లెక్కలు పక్కాగా వుంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. సైరా బయ్యర్లకు జీఎస్టీని నిర్మాత రామ్ చరణ్ నే చెల్లిస్తున్నారు. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ కాకుంటే జీఎస్టీ నిర్మాతే చెల్లించడం అన్నది టాలీవుడ్ లో ఇటీవల ఆనవాయతీగా మారింది.