టైటిల్ మాత్రమే బ్యూటిఫుల్

డైరక్టర్ ఆర్జీవీ నుంచి అద్భుతం ఆశించడం అంటే పక్కా అత్యాస మాత్రమే కాదు, అడియాస కూడా. టీజర్లు, ట్రయిలర్ల హడావుడి, మహా అయితే వాటితో ట్విట్టర్ లో హడావుడి తప్ప, మరేం వుండదు. జనాలకు…

డైరక్టర్ ఆర్జీవీ నుంచి అద్భుతం ఆశించడం అంటే పక్కా అత్యాస మాత్రమే కాదు, అడియాస కూడా. టీజర్లు, ట్రయిలర్ల హడావుడి, మహా అయితే వాటితో ట్విట్టర్ లో హడావుడి తప్ప, మరేం వుండదు. జనాలకు కూడా ఈ సంగతి బాగా అర్థం అయిపోయింది. అందుకే ఆర్జీవీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేస్తున్నాయి తప్ప గట్టెక్కిన దాఖలాలు లేకుండా పోయాయి.

ఇలాంటి నేపథ్యంలో తనే తీసిన సక్సెస్ ఫుల్ సినిమా రంగీలాకు ట్రిబ్యూట్ అంటూ బ్యూటిఫుల్ అనే సినిమాను చడీ చప్పుడు లేకుండా తీసేసారు. నిజానికి ఇలా తీసినవి, తీస్తూ ఆపేసినవి అనేకం వుండనే వున్నాయి. బ్యూటిఫుల్ సినిమా ట్రయిలర్ ను చూస్తుంటే వన్ పర్సంట్ కొత్తదనం అని కానీ, అహో అని కానీ ఒక్క క్షణం ఎక్కడయినా అనిపిస్తే ఒట్టు. 

శిష్యుడు పూరి జగన్నాధ్ తీసిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ ను ఆర్జీవీ చూసి, అందులోని  పాటల మాదిరిగా తీసేస్తే సినిమా ఆడేస్తుందనుకున్నారేమో? అదే టైమ్ లో ఆయన స్వర్ణయుగం నాటి రంగీలా గుర్తుకు వచ్చి వుంటుంది. ఇవన్నీ మిక్స్ చేసి ఓ ట్రయిలర్ చేసి వదిలారు.
హీరోయిన్ ఎంత చూపించాలో అంతా చూపించి, ఎంత గెంతాలో అంతలా గెంతేసింది. హీరో గెటప్ ఓ చోట చూస్తే షాకీ షర్రాఫ్ ఫస్ట్ సినిమా హీరోలో గెటప్ ను కాపీ కొట్టేసినట్లు క్లియర్ గా తెలిసిపోతోంది.

చూపించాల్సింది అంతా చూపించేసి, ఆపై విరహాలు, ఏడుపులు దట్టించి, ఏ ఫీలింగ్ లేని సాదా సీదా సినిమా ట్రయిలర్ బ్యూటిఫుల్ అంటూ జనం మీదకు వదిలారు.

దీన్ని చూసి జనం టైటిల్ కారణంగానైనా బ్యూటిఫుల్ అనేసుకుంటారని వర్మ అనుకుని వుండొచ్చు. కానీ అక్కడ అంత విషయం లేదు.