స్మార్ట్ సిటీకి కొత్త భయం…?

విశాఖ స్మార్ట్ సిటీగా ఉంది. ఏపీలో అతి పెద్ద నగరం. రాకపోకలతో ట్రాఫిక్ ఎపుడూ జామ్ అవుతూనే ఉంటుంది. ఇక సమ్మర్ సీజన్ ముగుస్తున్నా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున టూరిస్టులు విశాఖకు…

విశాఖ స్మార్ట్ సిటీగా ఉంది. ఏపీలో అతి పెద్ద నగరం. రాకపోకలతో ట్రాఫిక్ ఎపుడూ జామ్ అవుతూనే ఉంటుంది. ఇక సమ్మర్ సీజన్ ముగుస్తున్నా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున టూరిస్టులు విశాఖకు వస్తున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో మళ్ళీ కరోనా భయం కలకలం రేపుతోంది.

ఈ మధ్య దాకా కరోనా ఊసే లేని విశాఖలో ఇపుడు ఒక్కసారిగా పెరుగుతున్న కేసులు దడ పుట్టిస్తున్నాయి. విశాఖకు ఎయిర్, సీ, రోడ్, రైల్ కనెక్టివిటీ ఉంది. దాంతో ఎక్కడ నుంచి ఎక్కడికి అయినా జనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. 

దేశంలో కరోనా కేసులు పెరగడం, మహరాష్ట్రలో అవి ఎక్కువగా ఉండడంతో మెగా సిటీ కూడా అలెర్ట్ అవుతోంది. ఇక తాజా వివరాల ప్రకారం చూస్తే గత రెండు రోజులుగా వరసగా రెండు అంకెలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదు కావడంతో జాగ్రత‌ పడాల్సి ఉంది అని వైద్య వర్గాలు చెబుతున్నారు.

ముక్కున మాస్క్ అన్నది జనాలు మానేసి చాలా కాలం అయిన నేపధ్యంలో ఇపుడు తప్పనిసరిగా మాస్క్ వాడాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. 

ఇక విశాఖ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటిదాకా ఒక లక్షా 91 వేల పై చిలుకు నమోదు అయ్యారు. ఇప్పటిదాకా వచ్చిన అన్ని సీజన్లూ కలుపుకుని 1,153 మంది మరణించారు. దాంతో ఈసారి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.