వైఎస్సార్ కి ఘన నివాళిగా…ఆ ప్రాజెక్ట్

వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు అన్ని ప్రాంతాలను సమానంగా చూసేవారు. ఆయన దృష్టిలో ఒక సమస్య పడాలే కానీ దానికి సరైన పరిష్కారం చూపేవారు. అలా ఉత్తరాంధ్రా అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉందని, సాగునీరుకు,…

వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు అన్ని ప్రాంతాలను సమానంగా చూసేవారు. ఆయన దృష్టిలో ఒక సమస్య పడాలే కానీ దానికి సరైన పరిష్కారం చూపేవారు. అలా ఉత్తరాంధ్రా అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉందని, సాగునీరుకు, తాగునీరుకు కూడా సమస్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్సార్ కి అనాడు చెప్పినపుడు ఆయన ఆలోచనల నుంచి పుట్టినదే ఉత్తరాంధ్రా సుజల స్రవంతి పధకం.

ఆయన 2009 ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టుకు శంకుస్థపాన చేశారు. ఆన మళ్ళీ సీఎం అయిన కొద్ది నెలలకే చనిపోయారు. ఆయన బతికి ఉంటే ఏనాడో ఈ  ప్రాజెక్ట్ పూర్తి అయి వేలాది ఎకరాలకు సాగు నీరుతో పాటు జనాలకు తాగు నీరు, పరిశ్రమలకు సరిపడా నీరు లభించేదని అంతా అంటారు.

ఇక వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఈ పధకం మీద ఆలోచనలు చేస్తూ వచ్చారు. తాజాగా జలవనరుల శాఖ మంత్రిగా నియమితులైన అంబటి రాంబాబు విశాఖ టూర్ చేశారు. ఆయన ఉత్తరాంధ్రా సుజల స్రవంతి పధకాన్ని టాప్ ప్రయారిటీగా చేసి పూర్తి చేస్తామని చెప్పడం విశేషం. ఈ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏమిటి, దీనికి ఎదురవుతున్న అడ్డంకులు ఏమిటి అన్నది కూడా ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.

డాక్టర్ వైఎస్సార్ కలల రూపమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడం ద్వారా ఆ మహనీయుడికి నివాళి ఇస్తామని మరో మంత్రి గుడివాడ అమరనాధ్ చెబుతున్నారు. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే మాత్రం ఉత్తరాంధ్రా ప్రగతి బాటలో నడవడం ఖాయం. గోదారమ్మ గలగలలతో ఉత్తరాంధ్రా పల్లెసీమలు సస్యశ్యామలం కావడం కూడా తధ్యం.