ప్రకాష్ రాజ్ పామును చంపలేదు.. కర్ర విరగలేదు

“కర్ర విరగలేదు-పాము చావలేదు” అనేది ఓ సామెత. నటుడు ప్రకాష్ రాజ్ మాటలు సరిగ్గా ఇలానే ఉన్నాయి. పవన్ కల్యాణ్ పై వర్మ తీసిన “పవర్ స్టార్” అనే సినిమాపై స్పందించమంటే సరిగ్గా ఇలానే…

“కర్ర విరగలేదు-పాము చావలేదు” అనేది ఓ సామెత. నటుడు ప్రకాష్ రాజ్ మాటలు సరిగ్గా ఇలానే ఉన్నాయి. పవన్ కల్యాణ్ పై వర్మ తీసిన “పవర్ స్టార్” అనే సినిమాపై స్పందించమంటే సరిగ్గా ఇలానే స్పందించారు ప్రకాష్ రాజ్. వర్మను వెనకేసుకురాలేదు, అలా అని పవన్ ను కూడా సమర్థించలేదు.

“వర్మ సినిమా తీసినంత మాత్రాన పవన్ ఇమేజ్ ఒక్క శాతం కూడా తగ్గదు. అలా అని వర్మను తక్కువ చేయడానికి వీల్లేదు. లైన్ క్రాస్ చేసి సినిమా తీశారేమో చూడాలి. లైన్ క్రాస్ అయినప్పుడు నిలదీద్దాం, తిడదాం. అయినా పవన్ ది చాలా పెద్ద ఇమేజ్. 20-30 నిమిషాల సినిమాతో ఆయనకు ఏం కాదు.”

ఇలా ఓవైపు పవన్ ను వెనకేసుకొస్తూనే, వర్మ గీత దాటలేదంటూ సమర్థించారు ప్రకాష్ రాజ్. అయినా.. తిట్టుకోవడం, కొట్టుకోవడం కంటే ఒకరిపై ఒకరు సినిమాలు తీసుకోవడం బెటరని.. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కూడా అదే చేస్తున్నారని అంటున్నాడు.

“కొట్లాడుకోవడం, నిందించడం, దాడి చేయడం, బ్యాన్ చేయడం తప్పు. పవన్ పై వర్మ సినిమా తీశాడు. ఇంట్రెస్ట్ ఉంటే ఓసారి చూడండి. వర్మపై కూడా సినిమాలు తీస్తున్నారు. అది బెటర్ కదా. పవన్ ను అభిమానించే వాళ్లు, వర్మను అభిమానించే వాళ్లు దీన్ని లాజికల్ గా చూడాలి. ఎవరో ఏదో చెప్పారని, ఏదో తీశారని ఎవరి ఇమేజ్ తగ్గిపోదు.”

ఇలా పవర్ స్టార్ సినిమాపై తనదైన శైలిలో స్పందించాడు ప్రకాష్ రాజ్.  అలా మరోసారి తను మాటకారి అని రుజువుచేసుకున్నాడు.

లోకేష్ ని చూస్తే వణుకు వచ్చేస్తుంది

కత్తి మహేష్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ