మొన్న బన్నీ కూతురు.. ఈసారి మహేష్ కూతురు?

నటవారసుల కంటే నటవారసురాళ్లు తొందరగా తెరపైకొస్తున్నారు. మొన్నటికిమొన్న బన్నీ కూతురు అర్హ డెబ్యూ ఇచ్చేసింది. సమంత లీడ్ రోల్ పోషిస్తున్న శాకుంతలం సినిమాలో అర్హ చిన్నప్పటి భరతుడి పాత్ర పోషించింది. ఇప్పుడు మహేష్ బాబు…

నటవారసుల కంటే నటవారసురాళ్లు తొందరగా తెరపైకొస్తున్నారు. మొన్నటికిమొన్న బన్నీ కూతురు అర్హ డెబ్యూ ఇచ్చేసింది. సమంత లీడ్ రోల్ పోషిస్తున్న శాకుంతలం సినిమాలో అర్హ చిన్నప్పటి భరతుడి పాత్ర పోషించింది. ఇప్పుడు మహేష్ బాబు కూతురు సితార వంతు. అవును.. సీతూ పాప కూడా కెమెరా ముందుకొచ్చేందుకు రెడీ అవుతోందట.

విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఆ సినిమాలో ఓ కీలకమైన చిన్నారి పాత్ర ఉంది. ఆ పాత్రను మహేష్ కూతురు సితారతో చేయించాలనుకుంటున్నాడట వంశీ పైడిపల్లి. ఈ మేరకు తనకు బాగా క్లోజ్ అయిన మహేష్-నమ్రతతో పైడిపల్లి ఆల్రెడీ చర్చలు షురూ చేసినట్టు తెలుస్తోంది.

నిజానికి సితారకు కెమెరా కొత్తకాదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ చిన్నారి, యూట్యూబ్ లో కూడా హల్ చల్ చేసింది. 9 ఏళ్ల వయసుకే ఇనస్టాగ్రామ్ లో భారీ ఫాలోయింగ్ తో పాటు కాస్త డబ్బు కూడా సంపాదిస్తోంది. ఇప్పుడీ క్రేజీ కిడ్ ను తన సినిమాలోకి తీసుకోవాలని అనుకుంటున్నాడట వంశీ పైడిపల్లి.

మహేష్ కొడుకు ఆల్రెడీ తెరపైకొచ్చాడు. వన్-నేనొక్కడినే సినిమాలో నటించాడు. ఇప్పుడు సితార కూడా కెమెరా ముందుకొస్తే.. టోటల్ ఫ్యామిలీ అంతా నటజీవితంలోకి వచ్చినట్టవుతుంది. మరి సీతూ పాపకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా?