పోటా పోటీ పోస్టర్లు..టీజర్లు

దసరా అంటేనే సందడి. అలాంటి సందడి రోజును సినిమా జనాలు ఎందుకు వదులుకుంటారు. అందుకే దసరా సందర్భంగా, ఆ ముందు రోజు రకరకాల పబ్లిసిటీ మెటీరియల్ ను వదలడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. Advertisement సంక్రాంతికి…

దసరా అంటేనే సందడి. అలాంటి సందడి రోజును సినిమా జనాలు ఎందుకు వదులుకుంటారు. అందుకే దసరా సందర్భంగా, ఆ ముందు రోజు రకరకాల పబ్లిసిటీ మెటీరియల్ ను వదలడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

సంక్రాంతికి వస్తున్న రెండు భారీ సినిమాలు సరిలేరు నీకెవ్వరూ, అలాగే అల వైకుంఠపురములో. ఈ రెండు సినిమాలకు సంబంధించి రెండు పోస్టర్లు రేపు విడుదల చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ముచ్చటగా మూడో పోస్టర్ కూడా వుంది. అది బాలయ్య – కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పోస్టర్. 

అలాగే వెంకటేష్-నాగ్ చైతన్య కాంబినేషన్ లోని వెంకీ మామ టీజర్ రాబోతోంది. ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఓ చిన్న టీజర్ వేసే ఆలోచనలో వున్నారు. 

సాయి ధరమ్ తేజ్-బోగవిల్లి ప్రసాద్ కాంబినేషన్ లో కొత్త డైరక్టర్ తో చేయబోయే సినిమా 'సోలో బతుకే సో బెటర్'. ఈ సినిమా పూజ కార్యక్రమం రేపు జరగబోతోంది. ఈ సందర్భంగా సినిమా లోగో డిజైన్ ను వదలబోతున్నారు. 

అడవిసాయి కిరణ్ సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ట్రయిలర్ కూడా రేపే విడుదల చేస్తున్నారు. ఇవి కాక ఇంకా చాలా సినిమాల టీజర్లో, ఫస్ట్ లుక్ లో, పోస్టర్లో రేపు వరుసపెట్టి రాబోతున్నాయి.