అల్లరి నరేష్ అలిగాడా?

నిర్మాత అనిల్ సుంకర అంటే మాంచి అసోసియేషన్, అనుబంధం వుంది అల్లరి నరేష్ కు. చాలాసినిమాలు వాళ్ల బ్యానర్ లో వచ్చాయి. లేటెస్ట్ గా కళ్యాణరాముడు అనే సినిమా వస్తోంది కూడా. ఈ సినిమాను…

నిర్మాత అనిల్ సుంకర అంటే మాంచి అసోసియేషన్, అనుబంధం వుంది అల్లరి నరేష్ కు. చాలాసినిమాలు వాళ్ల బ్యానర్ లో వచ్చాయి. లేటెస్ట్ గా కళ్యాణరాముడు అనే సినిమా వస్తోంది కూడా. ఈ సినిమాను దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా విషయంలో హీరో అల్లరి నరేష్ అలిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాను చకచకా ఫినిష్ చేయడంలో యూనిట్ అంత ఆసక్తి ప్రదర్శించడం లేదని, సంక్రాంతికి విడుదల చేయాల్సిన పెద్ద సినిమా సరిలేరు నీకెవ్వరూ సినిమా వ్యవహారాల్లో బిజీ అయిపోయారని అల్లరి నరేష్ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే తన సినిమాకు సంబంధించి మిగిలిన మూడు నాలుగు రోజుల ప్యాచ్ వర్క్ ను పూర్తి చేయడం లేదని నిర్మాత సన్నిహితుడు, నిర్మాణ కార్యక్రమాలు అన్నీ చూసే కిషోర్ దగ్గర అల్లరి నరేష్ కాస్త నిష్టూరంగా చెప్పినట్లు తెలుస్తోంది.

దీంతో ఇప్పుడు ఈ వ్యవహారాల మీద ఏకె యూనిట్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అల్లరి నరేష్ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసారు. దీపావళికి ఎలాగైనా విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ దీపావళికి గట్టిపోటీ వుంది. అందువల్ల ఏం చేస్తారో చూడాలి.