జగన్ ఓ పెద్ద బీసీ… ఎస్సీ, ఎస్టీ…

ఈ మాటలు సంచలనంగా ఉండొచ్చు. కానీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం అలాగే అంటున్నారు. జగన్ కంటే పెద్ద బీసీ ఎవరున్నారు అని ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నారు. జగన్ని ఎవరైనా రెడ్డి…

ఈ మాటలు సంచలనంగా ఉండొచ్చు. కానీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం అలాగే అంటున్నారు. జగన్ కంటే పెద్ద బీసీ ఎవరున్నారు అని ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నారు. జగన్ని ఎవరైనా రెడ్డి సామాజికవర్గం అనుకుంటారు. కానీ అది కానే కాదు, ఆయన పక్కా బీసీ.

అంతే కాదు ఆయన ఒక ఎస్సీ, ఒక ఎస్టీ. ఆయనను మించిన అణగారిన వర్గాల నాయకుడు ఎవరూ లేరు. ఆయన పాలన సామాజిక న్యాయం దిశాగా సాగుతోంది. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న తపన తాపత్రయం ఉన్న ఏకైక లీడర్ జగన్ మాత్రమే అని సీతారాం అంటున్నారు.

జగన్ వచ్చే ఎన్నికల్లో యాభై శాతం సీట్లను బీసీలకే ఇస్తారు. ఇది నిజం. ఆయన నమ్మిన సిద్ధాంతం బడుగులను పైకి తీసుకురావడం, వారికి అండగా ఉండడం. ఈ విషయంలో ఆయన సాటీ పోటీ కూడా వేరెవరూ లేరు. ఇక రాబోరు అని ఆయన ఘంటాపధంగా చెప్పేసారు.

జగన్ తోనే ఏపీలో అట్టడుగు సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది అని ఆయన అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదని, ఏపీ సామాజిక చరిత్రలో సరికొత్త అధ్యాయానికి జగన్ తెర తీశారని ఇది శుభ పరిణామం అని ఆయనని ప్రశంసలతో ముంచెత్తారు. జగన్ ని ఇక మీదట ఎవరూ రెడ్డి అనరాదు, ఆయన బీసీలలో పెద్ద బీసీ అంటున్నారు బీసీల పార్టీ మాది, మా బాబే పెద్ద బీసీ అంటున్న టీడీపీ దీని మీద ఏమంటుందో చూడాలి.