బిగ్ బీ అమితాబ్ అంటే అందరికీ గౌరవం. బాలీవుడ్‌కు ఓ పెద్ద దిక్కు. అందుకు తగ్గట్టే ఆయన పెద్ద మనిషిలా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఆయన కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆయన్ను కరోనా ఏడ్పించింది. అయితే ఈ కన్నీళ్లు ఆనంద భాష్పాలని అర్థం చేసుకోవాలి.
కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేస్తున్న క్రమంలో సినీ సెలబ్రిటీలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఇళ్లలో ఉంటున్నారు. లాక్‌డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా షూటింగ్‌లకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బుల్లితెర, వెండితెరల షూటింగ్‌లు మొదలు పెట్టారు.
బిగ్ బీ అమితాబ్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆయన్ను కరోనా విడిచి పెట్టలేదు. బచ్చన్ కుటుంబంలో ఒక్క జయాబచ్చన్ మినహా మిగిలిన నలుగురు కుటుంబ సభ్యులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ముంబై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యరాయ్, ఆయన కుమార్తె ఆరాధ్య మాత్రం త్వరగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయం తెలిసి అమితాబ్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.
తన కోడలు, మనుమరాలు కరోనా నెగిటివ్‌తో డిశ్చార్జ్ అయ్యారని తెలిసిన క్షణంలో తన కళ్లలో నీళ్లు ఆగలేదంటూ బిగ్‌బీ తాజాగా ట్వీట్ చేశారు.
అభిమానుల ఆశీస్సులు అనంతం అంటూ ఆయన చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బిగ్ బీ కూడా త్వరగా కోలుకొని ఇంటికెళ్లాలని దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.