హీరోగా నాగార్జున చేయని ప్రయోగాలు లేవు. హిట్ లు ఫ్లాపులతో సంబంధం లేకుండా అన్ని రకాలు చేసేసాడు. ఇలా చేసిన వాటిలో పీరియాడికల్, హిస్టారికల్ సినిమాలు కూడా వున్నాయి. ఇప్పుడు మరోసారి అలాంటి జానర్ టచ్ చేస్తున్నాడు.
రచయిత బెజవాడ ప్రసన్న డైరక్టర్ గా మారుతున్న సినిమా కు పీరియాడికల్ కథ ఆధారం అంట. ఈ మధ్యన ఇలా సమ్ థింగ్ స్పెషల్ వుండకపోతే జనం థియేటర్ కు రావడం లేదు.
ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఎమోషన్ టచ్ వున్న ఈ కథ ముఫై నలభై ఏళ్ల వెనుక కాలంలో నడుస్తుందట. సోగ్గాడే చిన్ని నాయనా తరువాత నాగ్ నుంచి మాంచి ఎంటర్ టైనర్ రాలేదు. ఈ సినిమా ఆ లోటు తీర్చేలా వుంటుందట. మామూలుగానే బెజవాడ ప్రసన్న ఫన్ రైటర్. అందువల్ల ఎంటర్ టైన్ మెంట్ కచ్చితంగా వుంటుంది.
మరి పీరియాడికల్ కథ అంటే అదేంటో..దాని వైనమేంటో తెలియాల్సి వుంది. ప్రస్తుతం నాగ్ ఖాళీగా వున్నారు. ఏ సినిమా చేయడం లేదు. జనవరి లో ప్రసన్న సినిమా ప్రారంభం కావాల్సి వుంది. సమ్మర్ కు విడుదల టార్గెట్.