షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ పేరు రెండు రోజులుగా మారుమోగిపోతోంది. రేవ్/డ్రగ్స్ పార్టీలో అరెస్టై, పోలీస్ కస్టడీలో ఉన్న ఆర్యన్ పై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే మధ్యలో సడన్ గా షారుక్ కూతురు సుహానా ఖాన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. నెటిజన్లు ఆమెను కూడా చర్చలోకి లాగారు.
వాస్తవానికి సోషల్ మీడియాలో షారుఖ్ కొడుకు ఆర్యన్ కంటే సుహానా బాగా పాపులర్. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కి చాలామంది అభిమానులున్నారు. పిట్ట కొంచెం కానీ కూత ఘనం అనే టైప్ లో సుహానా, బాలీవుడ్ హీరోయిన్లకు ధీటుగా కనిపిస్తుంది. 21 ఏళ్ల సుహానా ఇన్ స్టా అకౌంట్ కి 21లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంతకీ ఆమె పెట్టిన పోస్టింగ్స్ ఎన్నో తెలుసా..? కేవలం 53 మాత్రమే. హాట్ ఫొటోలతో అందర్నీ కట్టిపడేస్తుంది సుహానా. ఓ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడని టాక్.
సుహానా ఖాన్ చిన్నప్పటి లుక్ చూస్తే అమ్మాయి బాగా నలుపు అని ఇట్టే అర్థమవుతుంది. అయితే ఆ తర్వాత మాత్రం ఆమె మేకోవర్ అయిపోయింది. 21 ఏళ్ల ఈ అమ్మాయి బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు. సినిమాల్లో కూడా త్వరలోనే ఎంట్రీ అనుకున్నారు. తీరా ఆమె బాయ్ ఫ్రెండ్స్ తో తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుండే సరికి అమ్మడు చాలా ఫాస్ట్ అని అర్థమైపోయింది.
అయితే సూపర్ స్టార్ కూతురు కదా, సోషల్ మీడియాలో ట్రోలింగ్ మినహా ఎక్కడా ఎవరూ ఆమె గురించి కామెంట్ చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఆర్యన్ అరెస్ట్ తో సుహానాపై కూడా కామెంట్స్ ఎక్కువయ్యాయి.
షారుఖ్ ఖాన్ తొలి సంతానం ఆర్యన్ ఖాన్. 23ఏళ్ల ఆర్యన్ సినీ ఇండస్ట్రీలోకి త్వరలోనే ఎంట్రీ ఇస్తారని అనుకుంటున్నారంతా. అయితే ఆర్యన్ కంటే రెండేళ్లు చిన్నదైన సుహానా.. అన్నకంటే ముందే ఎక్కువ పాపులర్ అయింది. సోషల్ మీడియా స్టార్ గా మారింది. ఆర్యన్ అరెస్ట్ తో సుహానా హాట్ ఫొటోలు, ఆమె వ్యవహారశైలిపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది.