అయింది ఏదో అయిపోయింది. బాలీవుడ్ టాప్ హీరో షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యారు. డ్రగ్స్ కేసులో అతగాడు దొరికాడు. కేసు బలంగా వుంది. ఇలాంటి నేపథ్యంలో అంతకు తగ్గ లాయర్ కావాలి. అందుకే సతీష్ మాన్ షిండె ను రంగంలోకి దింపారు.
రామ్ జెఠ్మాలనీ దగ్గర శిష్యరికం చేసిన ఈ లాయర్ కు గట్టివాడన్న పేరు వుంది. గతంలో అనేక సంచలన కేసులను వాదించి, తన క్లయింట్ లకు ఊరట కలిగేలా చేయగలిగారు.
సల్మాన్ జీంకల కేసు, డ్రంక్ అండ్ డ్రయివ్ కేసు, ,సంజయ్ దత్ ఆయుధాల కేసు, ఆ మద్య రియా చక్రవర్తి కేసు, ఇవన్నీ వాదించింది ఈ లాయరే.
అప్పుడే రంగంలోకి దిగిపోయి కోర్టు బయటే పాయింట్లు వినిపించడం ప్రారంభించేసారు. అసలు తన క్లయింట్ తనంతట తాను వెళ్లలేదని,, నిర్వాహకులే ఆహ్వానించారని, పైగా తన క్లయింట్ వద్ద మత్తు పదర్ధాలు ఏవీ స్వాధీనం చేసుకోలేదని పాయింట్ లాగేసారు కూడా.