మెగా అండ కాదు.. మెగా దండగ

పవర్ స్టార్ సినిమా గురించి రచ్చ జరుగుతున్న సందర్భంలో కనీసం మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా స్పందిస్తారని అనుకున్నారంతా. మిగతావాళ్ల విషయమేమో కానీ నాగబాబు మాత్రం కచ్చితంగా బైటకొస్తారని, సోషల్ మీడియా వేదికపై నుంచైనా…

పవర్ స్టార్ సినిమా గురించి రచ్చ జరుగుతున్న సందర్భంలో కనీసం మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా స్పందిస్తారని అనుకున్నారంతా. మిగతావాళ్ల విషయమేమో కానీ నాగబాబు మాత్రం కచ్చితంగా బైటకొస్తారని, సోషల్ మీడియా వేదికపై నుంచైనా తన ఆగ్రహం వ్యక్తం చేస్తారని, ఆర్జీవీ ఆఫీస్ పై దాడి జరిగిన తర్వాత అయినా ఆయన వెటకారం చేస్తారని అంచనా వేశారు. కానీ అవేవీ జరగలేదు.

అనుకున్నట్టుగానే నాగబాబు నుంచి రెండు ట్వీట్లు వచ్చాయి. అయితే అదంతా ఆయన రాజకీయ బాధ మాత్రమే. తమ్ముడ్ని సపోర్ట్ చేసేందుకు మాత్రం మెగా బ్రదర్ కి మాటరాలేదు. అంబటి రాంబాబు, విజయసాయిరెడ్డికి కరోనా సోకిందని, వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఓ వెటకారపు ట్వీట్ వేశారు నాగబాబు. శత్రువులు కూడా మంచిగా ఉండాలని ఆశించాలని అభిమానులకు ఓ సందేశాన్నిచ్చారు కూడా.

అసలు అంబటి, విజయసాయిరెడ్డితో నాగబాబుకు ఉన్న శతృత్వం ఏంటి? రాజకీయ వైరుధ్యాలున్నంత మాత్రాన.. కరోనా వ్యాధి గురించి ఎత్తి చూపుతూ అంత కామెడీ చేయాలా? మెగా ఫ్యామిలీ ఏమైనా కరోనాకి అతీతులనుకుంటున్నారా? ఈ ట్వీట్లతో తన చీప్ మెంటాలిటీని మరోసారి బైటపెట్టుకున్నారు నాగబాబు. మరి అదే సమయంలో తమ్ముడ్ని ఓ ఆటాడేసుకుంటున్న రామ్ గోపాల్ వర్మపై ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారనేదే అర్థం కావడం లేదు. ఇటీవల పవన్ కల్యాణ్ తో వచ్చిన విభేదాలే కారణమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

గాడ్సేపై నాగబాబు ట్వీట్స్ వేసిన సందర్భంలో వాటికి పార్టీకి ఏ సంబంధం లేదని పవన్ కల్యాణ్ కుండబద్ధలు కొట్టారు. అప్పట్నుంచి నాగబాబు… పార్టీకి-తమ్ముడికి దూరంగానే ఉంటూ వచ్చారు. అన్నీ పర్సనల్ ట్వీట్లే. పవన్ కల్యాణ్ కి, నాగబాబుకి బాగా గ్యాప్ వచ్చిందని అంటున్నారంతా. పరిస్థితులు బాగుంటే పవర్ స్టార్ సినిమా అనౌన్స్ మెంట్ రోజే మెగా బ్రదర్ బైటకొచ్చి వీరంగం వేయాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఆయనెందుకో పూర్తిగా మౌనవ్రతం పాటించారు.

సినిమాలో అన్నదమ్ములు ముగ్గుర్నీ చెడుగుడు ఆడుకున్నారనే సమాచారం ఉన్నా కూడా మెగా అండ అనుకున్న నాగబాబు మెగా దండగగా మారిపోయారు. చివరకు రాజకీయ చీప్ ట్వీట్స్ వేసుకుంటూ కాలం గడుపుతున్నారు.

గుమ్మడికాయల దొంగ అంటే, భుజాలు తడుముకుంటున్నారు

ఆర్జీవీకి సపోర్ట్ గా తరలి వచ్చిన ఫ్యాన్స్