నూతన శకం: వందరోజుల్లో లక్ష ఉద్యోగాలు

చరిత్రలో కనీవినీ ఎరుగని అధ్యాయం వంద రోజుల్లో లక్షా 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలు జగన్ రావడంతోనే ఏపీలో నూతన శకం మొదలైందని చాలామంది భావించారు. ఇప్పుడదే జరుగుతోంది. ప్రతి సెగ్మెంట్ లో తనదైన…

చరిత్రలో కనీవినీ ఎరుగని అధ్యాయం
వంద రోజుల్లో లక్షా 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలు

జగన్ రావడంతోనే ఏపీలో నూతన శకం మొదలైందని చాలామంది భావించారు. ఇప్పుడదే జరుగుతోంది. ప్రతి సెగ్మెంట్ లో తనదైన మార్క్ చూపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కూడా అదే వేగంతో దూసుకుపోతున్నారు. అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఉద్యోగాలు కల్పించినా జీతాలు ఎలా ఇస్తాం? ఈ రెండు ప్రశ్నల దగ్గరే ఆగిపోయిన రాజకీయ నాయకులు, అధికారులకు సరికొత్త మార్గం చూపించారు సీఎం. గ్రామ సచివాలయం కాన్సెప్ట్ తో లక్షల ఉద్యోగాల్ని సృష్టించారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తూనే, పాలనలో ఓ కొత్త శకం తీసుకొచ్చారు.

ఇకపై తమ అవసరాల కోసం ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగనక్కర్లేదు. గ్రామ వాలంటీర్లే ప్రజల తరఫున ఆ పనులు పూర్తిచేస్తారు. ఇకపై కీలకమైన పనుల కోసం రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు. గ్రామ సచివాలయం ఆ పనులు చూసుకుంటుంది. కార్పొరేట్ తరహాలో డేట్ చెప్పి మరీ రోజుల వ్యవధిలో పనులు పూర్తిచేస్తారు. అక్టోబర్ 2 నుంచి ఇలా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాలు ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి. అంటే ప్రజల ఇంటివద్దకే పాలన అన్నమాట.

గ్రామ, వార్డ్ సచివాలయ వ్యవస్థ ఏర్పాటును సీఎం జగన్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తన లక్ష్యాల్ని నూతన ఉద్యోగులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. ఈరోజు విజయవాడలోని ఎ-కన్వెన్షన్ హాల్ లో జరిగే కార్యక్రమంలో స్వయంగా తన చేతుల మీదుగా ఎంపికైన కొంతమంది అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వబోతున్న జగన్.. అక్టోబర్ 2న తూర్పుగోదావరి జిల్లాలో జరగనున్న ఓ కార్యక్రమంలో అధికారికంగా గ్రామ/వార్డ్ సచివాలయాల కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నారు.

అక్టోబర్ 2న మండలానికి ఒకటి చొప్పున 660 గ్రామ సచివాలయాలు ప్రారంభం కాబోతున్నాయి. అదే సమయంలో 110 వార్డ్ సచివాలయాలు కూడా ప్రారంభం అవుతాయి. మొదటి రోజున కేవలం 3 సేవలతో మాత్రమే ఈ సచివాలయాల్ని ప్రారంభిస్తున్నారు. క్రమంగా వీటిని 70 సేవలు అందించే సచివాలయాలుగా తీర్చిదిద్దుతారు. తద్వారా యువతకు ఉద్యోగాలు లభించడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత దగ్గరవుతాయి.

హీరో ఫోన్ చేయగానే సెకండ్లలో వచ్చిన డైరెక్టర్..?