జనసేనలోంచి బీజేపీలోకి చేరికలట!

ఎన్నికలకు ముందు జనసేనలో హడావుడి చేసినవారి పరిస్థితి ఏపీలో చాలా చిత్రంగా ఉందని సమాచారం. జనసేన హడావుడి అంతా ఎన్నికలకు ఆరునెలల ముందు మొదలైంది. సినిమా షూటింగ్ అయిపోయినట్టుగా.. ఎన్నికలు అయిపోగానే ఆ పార్టీ…

ఎన్నికలకు ముందు జనసేనలో హడావుడి చేసినవారి పరిస్థితి ఏపీలో చాలా చిత్రంగా ఉందని సమాచారం. జనసేన హడావుడి అంతా ఎన్నికలకు ఆరునెలల ముందు మొదలైంది. సినిమా షూటింగ్ అయిపోయినట్టుగా.. ఎన్నికలు అయిపోగానే ఆ పార్టీ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఏమీలేకుండా పోయాయి. పవన్ కల్యాణ్ పలు రివ్యూ మీటింగులు గట్రా పెట్టినా.. అవన్నీ ఏసీ హాల్స్ కార్యక్రమాలే.

ఇలాంటి నేపథ్యంలో… జనసేనపై ఇంకా క్షేత్రస్థాయి కార్యకర్తలు మోజు కలిగి ఉన్నా వారికి పార్టీ ఎలాంటి పనీ కల్పించలేకపోతోంది. ఇక జనసేన రాష్ట్రంలో అధికార భాగస్వామి అవుతుందని, భవిష్యత్తులో అధికారం దిశగా వెళ్తుంది, తాము జనసేన కార్యకర్తలుగా క్షేత్రస్థాయిలో ఉనికి చాటుకోవచ్చు అని ఆశించిన వారి సంగతి సరేసరి!

ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా పనిచేసే వ్యక్తి గ్రౌండ్ లెవల్లో తన పరపతి ఎంతలా ఉపయోగపడాలని అనుకుంటాడో వేరే చెప్పనక్కర్లేదు. అయితే జనసేన కార్యకర్తలంటే మాత్రం క్షేత్ర స్థాయిలో ఏమాత్రం విలువ లేకుండా పోయింది. పవన్ పార్టీ పట్ల సామాన్యుల్లో ఎలాంటి ఆదరణ లేని నేపథ్యంలో.. ఆ పార్టీ కార్యకర్తలను పట్టించుకునే నాథుడు లేడు.

అందుకే రాజకీయాలను పార్ట్ టైమ్ గానో, ఫుల్ టైమ్ గానో కెరీర్ గా తీసుకుని జనసేన వైపు వెళ్లినవారు కూడా ఇప్పుడు వేరే దారులు చూసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల పరిధిలో జనసేన 'కార్యకర్తలు' వేరే పార్టీల్లోకి చేరిపోతున్నారట. ఇప్పటికే పార్టీ యాక్టివిటీస్ కు ఎన్నికల నాటి నేతలు చాలామంది దూరం అయ్యారు.

పవన్ పక్కనే కనిపించిన వారు కూడా చాలామంది తెరమరుగు అయ్యారు. అలాంటప్పుడు క్షేత్రస్థాయి కార్యకర్తలు వేరేదారి చూసుకోవడం పెద్ద ఆశ్చర్యం లేదేమో. మైదుకూరు ప్రాంతంలో కొంతమంది జనసేన  కార్యకర్తలు బీజేపీలోకి చేరారట! మొత్తానికి జనసేన తరఫు పనిచేసిన వారికి ఆ పార్టీ కన్నా బీజేపీనే భరోసా ఇస్తోందనమాట అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

హీరో ఫోన్ చేయగానే సెకండ్లలో వచ్చిన డైరెక్టర్..?