అది పవన్‌కల్యాణ్‌కు ఎంతో ఇష్టమైన ప్రదేశం. చుట్టూ పచ్చదనం, ఆవులు. వాటికి మేత అందిస్తూ పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. ఈ దృశ్యాలేమీ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘పవర్‌స్టార్’లోనివి ఎంత మాత్రం కావు. జనసేన విడుదల చేసిన పవన్‌కల్యాణ్ ఇంటర్వ్యూలోని దృశ్యాలు. పవన్‌కల్యాణ్‌కు ఏదీ ‘ఒకటి్’ కలిసి రానట్టుంది. అందుకే ఆయన ఏది చేసినా ఒకటికి మించి ఉండాల్సిందేమో. గత సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన ఏకైక నాయకుడు పవన్‌కల్యాణే. ప్రస్తుతం 20-21 నిమిషాల నిడివితో కూడిన ఇంటర్వ్యూ జనసేన విడుదల చేసింది. ఇది పార్ట్-1.
ఇంకా మున్ముందు ఎన్ని పార్ట్‌లు ఉంటాయో తెలి యదు. పార్ట్-2, 3, 4 ఏమో…పవన్ మనసులో మాట్లాడాల్సిన ఏఏ ముఖ్యమైన అంశాలున్నాయో ఎవరికి తెలుసు? కానీ పవన్‌కల్యాణ్ పార్ట్ ఇంటర్వ్యూ-1 మాత్రం జనసైనికుల్ని, ఫ్యాన్స్‌ని మాత్రం తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పక తప్పదు. సహజంగా రాజకీయ నాయకులు తమపై విమర్శలు, సమాజంలో ఎక్కువ చర్చనీయాంశమవుతున్న, వివాదాస్పదమవుతున్న అంశాలపై మాట్లాడేందుకు జర్నలిస్టులకు ముందే చెప్పి…ప్రశ్నలు వేయించుకుని ఘాటుగా స్పందిస్తుంటారు.
పవన్‌కల్యాణ్ ఇంటర్వ్యూను గమనిస్తే…ఇది ఆయనకు లాభం తేవడం కంటే నష్టమే తెచ్చిందని చెప్పొచ్చు. కొన్ని సమయాల్లో మాట్లాడకపోవడమే ఉత్తమం. ఏదైనా గుప్పిట మూసి ఉంచే వరకు గప్పి ఉంటుంది. గుప్పిట తెరిస్తే…చెప్పుకోడానికి ఏమీ ఉండదు. ఈ ఇంటర్వ్యూలో పవన్ ఆ గప్పీని పోగొట్టుకున్నారు. ప్రధానంగా ఆయన మాట్లాడాల్సిన అంశంపై కాకుండా ఇతరత్రా వాటిపై నోరు విప్పారు.
పవన్‌కల్యాణ్ కేవలం జనసేనాని మాత్రమే కాదు. ఆయన టాలీవుడ్ అగ్రహీరో. రెండు తెలుగు రాష్ట్రాల్లో హీరోగా ఆయన్ని అభిమానించే వాళ్లు లక్షల్లో ఉన్నారు. సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెరకెక్కించిన చిత్రం ‘పవర్‌స్టార్’ విడుదలకు మరో 24 గంటల సమయం మాత్రమే ఉంది. తమ అభిమాన హీరోని కించపరుస్తూ సినిమా తీయడాన్ని నిరసిస్తూ జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ హైదరాబాద్‌లో వర్మ కార్యాలయంపై దాడి కూడా చేశారు. దీన్ని బట్టి పవన్ అభిమానులు, జనసైనికులు ఎంతగా రగిలిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో ప్రజల మనోభావాలను గుర్తెరిగి ఇంటర్వ్యూలో మాట్లాడితే ఆకట్టుకుంటుంది. కానీ పవన్‌కల్యాణ్ ప్రజలు ఆశించిన లేదా కోరుకున్న విధంగా కాకుండా…తానేం ఆలోచిస్తున్నారో అందుకు తగ్గట్టుగా తన వాడితో ప్రశ్నలు వేయించుకుని, సమాధా నాలు చెప్పారు. అందువల్లే ఈ ఇంటర్వ్యూ అట్టర్ ప్లాప్ అయింది. ‘పవర్‌స్టార్’పై పవన్ తప్పక మాట్లాడాల్సిన సమయం ఇది. ‘పవర్‌స్టార్’పై అభిమానులు, జనసైనికులు సోషల్ మీడియా దాటి ప్రత్యక్షంగా కొట్టుకు చస్తుంటే….వర్మ సినిమాకు కేంద్ర బిందువైన పవన్ మాత్రం అసలు విషయాన్ని ఉద్దేశ పూర్వకంగానే విస్మరించి ఉస్సూరుమనిపించారు.
మూడు రాజధానులు, కరోనా, ఇళ్ల పట్టాలు తదితర రాజకీయ అంశాలు ఎప్పుడూ ఉండేవే. ఇవేమీ కొత్తగా ఇప్పుడు వచ్చినవి కావు. చాతుర్మాస్య దీక్ష అనేది పవన్ వ్యక్తిగత అంశం. ఆ దీక్ష గురించి తెలుసుకోవాలని ఎవరికీ ఆసక్తి ఉండదు. పవన్ కల్యాణ్‌లోని ప్రధాన లోపం ఇదే. ఎంతసేపూ తన దృష్టి కోణం నుంచే చూడాలని కోరుకుంటారు. ప్రజలు, అభిమానులు, జన సైనికుల మనస్సుల్లో ఏముంది? తన నుంచి వారేం కోరుకుంటున్నారు? ఇప్పుడు ప్రధానంగా చర్చ, రచ్చ ఏంటి? తానేం మాట్లాడాలి…మాట్లాడితే బాగుంటుందనే విషయమై ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించరు. రాజకీయంగా ఫెయిల్ కావడానికి ఆయన తీరే కారణం.
వైసీపీ అధినేత జగన్‌ను ఓడించాలని వ్యక్తిగతంగా ఆయన ప్రతినబూనాడు. కానీ జనం మాత్రం చంద్రబాబు అంతు చూడాలను కున్నారు. దాన్ని పవన్‌కల్యాణ్ పరిగణలోకి తీసుకోకుండా తన అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజల్ని తిప్పాలని యత్నించి బాబుతో పాటు తాను జన సునామీలో కొట్టుకుపోయారు.
‘పవర్‌స్టార్’లో అనేక వివాదాస్పద అంశాలున్నట్టు ట్రైలర్‌ను చూస్తే తెలుస్తుంది. మెగాస్టార్ నిలదీత, నాగబాబు తిట్లు, పూణే నుంచి ఫోన్, రష్యన్ భార్య ఆగ్రహం, ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక చేసే రాద్ధాంతం, చంద్రబాబుకు దండం పెట్టి ఇంట్లో నుంచి సాగనంపడం…తదితర కాంట్రవర్సీలపై ఆయన మాట్లాడి ఉంటే…ఇంటర్వ్యూ అదిరిపోయేది. ఆ ఇంటర్వ్యూను జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వర్మ సినిమాకు కౌంటర్‌గా వైరల్ చేసేవాళ్లు.
కానీ అలా జరగలేదు. పవన్ ఉలుకూపలుకూ లేకుండా ఉండడం వల్లే వర్మకు కౌంటర్‌గా ఏదో ఉడతాభక్తిగా ‘పరాన్నజీవి’ అంటూ తెరకెక్కించి పవన్‌పై ఫ్యాన్స్ అభిమానాన్ని చాటుకుంటున్నారు. బహుశా ఆయన ‘పవర్‌స్టార్’ సినిమా చూసిన తర్వాత…పార్ట్-2 లేదా పార్ట్-3 ఇంటర్వ్యూల్లో ఆ విషయాల గురించి మాట్లాడాలని భావిస్తున్నారా?
కేవలం తన పార్టీ మీడియా హెడ్‌తో ఇంటర్వ్యూ చేయించుకోవడంలోనే జనసేనాని ఉద్దేశం ఏంటో తెలిసిపోతోంది. మీడియాతో మాట్లాడితే ‘పవర్‌స్టార్’పై సంధించే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి పవన్ భయపడుతున్నారా? అందుకే మీడియా మిత్రుల్ని పిలిచి ఇంటర్వ్యూ ఇవ్వడానికి దూరంగా ఉన్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. మొత్తానికి తాజా ఇంటర్వ్యూ మాత్రం జనసైనికులకు, పవన్ ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ మిగిల్చిందని చెప్పొచ్చు. కనీసం ఈ ఇంటర్వ్యూ తనకైనా సంతృప్తినిచ్చిందా? అంటే అనుమానమే అని చెప్పక తప్పదేమో!