దాదాపు 2 నెలలుగా నడిచిన ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది. టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య-సమంత విడిపోతున్నారనే పుకార్లే నిజమయ్యాయి. వాళ్లిద్దరూ విడిపోయారు. విడిపోవాలని ఇద్దరం నిర్ణయించుకున్నామని స్వయంగా నాగచైతన్య వెల్లడించాడు.
“ఎన్నో చర్చలు, ఆలోచనల తర్వాత నేను, సమంత విడిపోవాలని నిర్ణయించుకున్నానం. ఇకపై భార్యాభర్తలుగా మా దారులు మావి. పదేళ్ల కిందట అదృష్టంకొద్దీ మా ఇద్దరి ఫ్రెండ్ షిప్ మొదలైంది. మా అనుబంధానికి పునాది అదే. మా ఇద్దరి మధ్య ఆ ప్రత్యేక స్నేహబంధం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని మేం నమ్ముతున్నాం.”
ఇలా సమంతతో విడిపోయిన విషయాన్ని నాగచైతన్య అధికారికంగా ప్రకటించాడు. ఈ క్లిష్ట సమయంలో మీడియా, ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు తమకు అండగా నిలవాలని, తమకు ప్రైవసీని ఇవ్వాలని కోరాడు చైతన్య.
కొన్ని రోజుల కిందట తన సోషల్ మీడియా ఎకౌంట్ నుంచి ''అక్కినేని'' అనే పదాన్ని తొలిగించింది సమంత. అప్పట్నుంచి చై-శామ్ మధ్య బంధంపై అనుమానాలు పెరిగాయి. ఆ అనుమానాల్ని నిజం చేస్తూ సమంత ఎప్పటికప్పుడు పరోక్షంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉంది.
అటు నాగచైతన్య కూడా రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విడిపోవడం బాధగానే ఉందంటూ నర్మగర్బంగా వ్యాఖ్యానించాడు. ఇలా కొన్నాళ్లుగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ టౌన్ గా ఉన్న ఈ మేటర్ కు నాగచైతన్య ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాడు. సమంతతో విడిపోయిన విషయాన్ని ప్రకటించాడు.
రీసెంట్ గా లవ్ స్టోరీతో సూపర్ హిట్ కొట్టాడు నాగచైతన్య. ఆ సక్సెస్ ను అతడు ఎంజాయ్ చేసే మూడ్ లో లేడనే విషయం తాజా ఘటనతో తేలిపోయింది.