బిగ్ బాస్ హిందీ వెర్షన్ విషయంలో భారీ స్థాయి నంబర్లే వినిపిస్తూ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ కు హోస్టుగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు సీజన్ ముగిసే సరికి వందల కోట్ల రూపాయల పారితోషికం అందుతుందనే వార్తలు ఇది వరకే వచ్చాయి. వారాంతపు ఎపిసోడ్లలో కనిపిస్తే చాలు సల్మాన్ కు కోట్ల రూపాయలు వచ్చి పడతాయంటారు.
కేవలం హోస్టుకే కాదు.. పార్టిసిపెంట్స్ కు కూడా మంచి రేంజ్ రెమ్యూనిరేషన్లే ఉన్నట్టున్నాయక్కడ. ఈ క్రమంలో ఇలాంటి ఆఫరే వచ్చిందట రియాచక్రబర్తికి. ఈమెను తాజా సీజన్లో పార్టిసిపేట్ చేయమని ఆఫర్ వచ్చిందట. ఊరికే కాదు, వారానికి 35 లక్షల రూపాయల చొప్పున రెమ్యూనిరేషన్ ను కూడా ఆఫర్ చేశారట. అయితే ఈ ఆఫర్ ను రియా టర్న్ డౌన్ చేసినట్టుగా తెలుస్తోంది.
బిగ్ బాస్ హోస్ కు కావాల్సింది వివాదాస్పదులు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం సమయంలో రియా పేరు వివాదాల్లో నానింది. ఈమెను విపరీతంగా నిందిస్తూ అనేక మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సుశాంత్ చనిపోయాడు కాబట్టి.. రియానే దానికి కారణం అన్నట్టుగా రచ్చ జరిగింది. ఇక డ్రగ్స్ వ్యవహారంలో కూడా ఈమె విచారణను ఎదుర్కొంది. కొన్నాళ్ల పాటు జైల్లో ఉండింది. బెయిల్ పై విడుదల అయ్యింది.
ఇలాంటి నేపథ్యం ఉన్న రియా తమ హౌస్ కు ప్లస్ అవుతుందని బిగ్ బాస్ నిర్వాహకులు భావించినట్టుగా ఉన్నారు. ఇక రియాకు ఇప్పుడు హిందీ అవకాశాలు ఏమీ లేవు. ఈమెను ఒక నిషేధిత వ్యక్తిగా ట్రీట్ చేస్తున్నారు బాలీవుడ్ లో. ఈమెకు అవకాశాలు ఇస్తే తమను కూడా నెగిటివ్ చూస్తారన్నట్టుగా కొందరు భావిస్తున్నట్టుగా ఉన్నారు.
మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. రియా మాత్రం బిగ్ బాస్ ఆఫర్ కు నో చెప్పిందట. హౌస్ లో స్టే చేసినన్ని రోజులూ రోజుకు ఐదు లక్షల రూపాయల మొత్తం వచ్చే అవకాశం ఉన్నా.. రియా అందుకు నో చెప్పినట్టుగా సమాచారం.