ఏపీ, తెలంగాణలలో వివిధ కారణాలతో ఖాళీ అయిన అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
దేశ వ్యాప్తంగా మూడు పార్లమెంట్ స్థానాలు, 30 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం అక్టోబర్ 30న ఉప ఎన్నికలు, నవంబర్ 2న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
ఏపీలో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే తెలంగాణలో ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ స్థానం ఖాళీ అయ్యింది.
ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. అక్కడ టీఆర్ఎస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకుంది. ఇప్పటికే అక్కడ ప్రచారం ప్రారంభించారు.
ఇక బద్వేలు విషయానికి వస్తే డాక్టర్ వెంకటసుబ్బయ్య సతీమణిని డాక్టర్ సంధ్యను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. టీడీపీ కూడా పాతకాపునే అభ్యర్థిగా ప్రకటించింది.
ఓబులాపురం రాజశేఖర్‌ను మరోసారి టీడీపీ బరిలో దించనుంది. బద్వేలులో పోటీ నామమాత్రమే. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో మళ్లొకసారి రాజకీయ వేడి రాజుకోనుంది. మరో పోరుకు కేవలం నెల రోజుల గడువు మాత్రమే ఉంది.