ఈ విషయం మేం చెప్పడం లేదు. ఓ సిద్ధాంతి చెబుతున్నాడు. సెలబ్రిటీల జాతకాలు చూసే పండిత్ జగన్నాధ్ గురూజీ అనే వ్యక్తి ఈ విషయం చెబుతున్నాడు. వచ్చే ఏడాది అనుష్క కచ్చితంగా పెళ్లి చేసుకుంటుందట.
ఒకవేళ వచ్చే ఏడాది ఆమె పెళ్లి జరగకపోతే.. 2023 ప్రథమార్థంలో కచ్చితంగా అనుష్క పెళ్లి అయిపోతుందని ఆయన చెబుతున్నాడు. జాతకం ప్రకారం, 39 ఏళ్ల అనుష్క అవివాహితగా ఉండే ప్రసక్తి లేదని, ఆమె జాతకంలో పెళ్లి యోగం ఉందని ఆయన ఘంటాపథంగా చెబుతున్నాడు.
దాదాపు దశాబ్ద కాలంగా అనుష్క పెళ్లి మేటర్ పై చర్చ జరుగుతూనే ఉంది. ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకుంటారనే వార్త ప్రముఖంగా వినిపించింది. ఒక దశలో బాలీవుడ్ మీడియా కూడా ఈ అంశాన్ని ఎత్తుకోవడంతో.. దీనిపై అనుష్క-ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకున్నారు.
ఆ తర్వాత దుబాయ్ కు చెందిన ఓ పారిశ్రామికవేత్తతో అనుష్క పెళ్లి అంటూ మరో ప్రచారం ఊపందుకుంది. కేవలం ఈ పెళ్లి కోసమే అనుష్క బరువు తగ్గే పనిలో ఉందని, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై చేయాల్సిన ఓ సినిమాను కూడా పెళ్లి కోసమే పక్కనపెట్టిందనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే అవి కూడా పుకార్లు గానే మిగిలిపోయాయి. మధ్యలో టాలీవుడ్ కు చెందిన ఓ సీనియర్ ప్రముఖ దర్శకుడి కొడుకును అనుష్క పెళ్లాడుతుందనే ప్రచారం కూడా జరిగింది.
ఇలా మినిమం గ్యాప్స్ లో అనుష్క పెళ్లిపై కథనాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సిద్ధాంతి మూలంగా మరోసారి ఆమె పెళ్లి వార్తల్లోకెక్కింది. సినీపరిశ్రమతో సంబంధం లేని వ్యక్తినే అనుష్క పెళ్లాడుతుందని కూడా ఆయన చెబుతున్నాడు.