పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కంటిలో నలుసులా తయారయ్యాడు డైరక్టర్ ఆర్జీవీ. ఎంత పట్టించుకోకుండా వదిలేద్దాం అనుకున్నా, ఆయన వదలుతున్న కంటెంట్ వాళ్లకు వళ్లు మండేలా చేస్తోంది. ఈ నెల 25న పవర్ స్టార్ సినిమా విడుదల అంటూ ఇప్పటికే ఆర్జీవీ ప్రకటించేసారు. ఈ నేపథ్యంలో ఆ లోగానే ఆర్జీవీ మీద ఓ సినిమా తీసి ఆన్ లైన్ లోకి ఉచితంగా వదిలేస్తే..?
ఇదే ఆలోచన పవన్ ఫ్యాన్స్ కొందరు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన అభిమాని, పవన్ అభిమాని అయిన ఉత్తరాంధ్రకు చెందిన ఓ వ్యక్తి ఈ కార్యక్రమానికి పూనుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో సడెన్ గా ఓ రియాల్టీ షో తో తెరపైకి వచ్చిన ఈ పవన్ అభిమాని ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నట్లు బోగట్టా.
అయితే టైమ్ చాలా తక్కువ వుంది. గట్టిగా ఏడు రోజులు సమయం కూడా లేదు. ఆర్జీవీ మాత్రమే రెండు రోజుల్లో సినిమా చేసి, మూడో రోజున విడుదల చేయగలరు. అందరికీ ఇది సాధ్యం అయ్యే ఫీట్ కాదు. అందువల్ల ఈ జనసేన అభిమాని చేస్తున్న ప్రయత్నం సాధ్యం అవుతుందో కాదో చూడాలి.