వెండితెర అయినా, బుల్లితెర అయినా.. సినీ టీవీ పరిశ్రమల్లో వ్యక్తిగత స్వార్థం చూసుకునే వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. నాకేంటి అనేవారే ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం స్నేహానికి విలువ ఇస్తుంటారు. జబర్దస్త్ యాంకర్ రష్మి రెండో టైపు. తన కెరీర్ లో చాలా ఇబ్బందులు పడి ఈ స్థాయికి వచ్చానని రష్మీ పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది, అయితే తన కన్నీటి గాథ గురించి ఎవరూ జాలిపడాల్సిన అవసరం లేదని కూడా స్టేట్ మెంట్లు ఇచ్చింది. అలాంటి స్టేజ్ నుంచి వచ్చింది కాబట్టే.. జబర్దస్త్ లో ఎవరు ఏ సాయం అడిగినా కాదనకుండా చేస్తుంది రేష్మి.
నెల్లూరుకు చెందిన జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ చిన్న ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ పెట్టాడు. దీనికి సంబంధించి ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమానికి రష్మిని ఆహ్వానించాడు. ఫ్రెండ్ షిప్ కొద్దీ రష్మిని కాస్త రెమ్యునరేషన్ విషయంలో ఉదారంగా ఉండాలని కోరాడట. ఇచ్చినమాట ప్రకారం వస్తానని చెప్పిన రష్మి, ఓపెనింగ్ కోసం డబ్బులు తీసుకోవడం లేదు. ఫ్రీగా చేసి పెడుతోంది.
నిజానికి రష్మి గౌతమ్ కాల్షీట్ కావాలంటే లక్షల్లో వ్యవహారం. జబర్దస్త్ రెమ్యునరేషన్ ప్రకారం అయితే రష్మికి నెలకు నాలుగు ఎపిసోడ్లకు కలసి 2 లక్షలకు పైగానే ముడుతుంది. బైట ఫంక్షన్లకు కాల్షీట్ ఇస్తే ప్రోగ్రామ్, ఆయా సంస్థలను బట్టి 2 నుంచి 4 లక్షల వరకు డిమాండ్ చేస్తుంది. ఆ లెక్కన ఆర్పీ కోసం రష్మి తన కాల్షీట్ ని, దాదాపు 2 లక్షల రూపాయల్ని త్యాగం చేసిందన్న మాట.
ఇదే విషయాన్ని ఆర్పీ తన వాళ్లందరి దగ్గర ప్రస్తావిస్తున్నాడు. తనుచూసిన అతికొద్దిమంది వ్యక్తుల్లో రష్మి కూడా ఒకరని మెచ్చుకుంటున్నాడు. నిజానికి ఆర్పీ విషయంలోనే కాదు.. జబర్దస్త్ కు చెందిన ఎంతోమంది నటుల విషయంలో రష్మి ఇలా ఉదారంగా వ్యవహరించిన సందర్భాలున్నాయి. అలా తనకు అందమేకాదు, మంచి మనసు కూడా ఉందని నిరూపించుకుంటోంది రష్మి.