తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండు రోజుల్లో డీఎస్సీ నోటీఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మొత్తం 6,500కు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. వీటిలో పాఠశాల విద్యలో 5,089.. ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1,523 పోస్టులు ఉంటాయని పేర్కొన్నారు.
మరో మూడు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసింది. తాజా నోటిఫికేషన్తో టీచర్ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నా వారికి పెద్ద శుభవార్తనే అందించింది.
మరోవైపు ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ సెప్టెంబర్… మరో నాలుగు నెలల్లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామంటూ మాటలు చెప్పడం తప్ప ఇంతవరకు ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడం.. సచివాలయాల ఉద్యోగాలు గురించి తప్ప మరో మాట మాట్లాడకపోవడం అందరికి తెలిసిందే. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం లాగా ఏపీ ప్రభుత్వం కూడా వీలైనంత తొందరగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగ యువత కోరుతున్నారు.