ఇది అంచనాలు పెంచడం కాదేమో డీఎస్పీ!

ఒక సింపుల్ ప్రశ్న. ప్రోమో ఎందుకు రిలీజ్ చేస్తారు? టీజర్, ట్రయిలర్ ఎందుకు లాంచ్ చేస్తారు? తమ సినిమాపై లేదా సాంగ్ పై అంచనాల్ని పెంచడం కోసం ఇలాంటి పనులు చేస్తుంటారు. మరి అలా…

ఒక సింపుల్ ప్రశ్న. ప్రోమో ఎందుకు రిలీజ్ చేస్తారు? టీజర్, ట్రయిలర్ ఎందుకు లాంచ్ చేస్తారు? తమ సినిమాపై లేదా సాంగ్ పై అంచనాల్ని పెంచడం కోసం ఇలాంటి పనులు చేస్తుంటారు. మరి అలా రిలీజ్ చేసిన ప్రోమోనే మిస్ ఫైర్ అయితే ఏంటి పరిస్థితి? వాల్తేరు వీరయ్యది ఇదే పరిస్థితి.

బాస్ పార్టీ అంటూ గ్రాండ్ గా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. అంచనాల్ని పెంచే క్రమంలో రిలీజ్ చేసిన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అంతా సెట్ అనుకున్న టైమ్ లో వచ్చింది ప్రోమో.

నువ్వు లుంగీ ఎత్తుకో, నువ్వు షర్ట్ ముడేస్కో, నువ్వు కర్టీఫ్ కట్టుకో అంటూ దేవిశ్రీ పాడిన చిన్న బిట్ ను ప్రోమోగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూసి షాక్ అవ్వడం అభిమానుల వంతయింది. బాస్ పార్టీ అంటూ రిలీజ్ చేసిన ఈ ప్రోమో అస్సలు అంచనాలు పెంచేలా లేదు.

వాల్తేరు వీరయ్య నుంచి వస్తున్న మొదటి సాంగ్ ఎలా ఉంటుందో వినాలనే ఉత్సకతతో దాదాపు 48 గంటలుగా ఎదురుచూస్తున్న మెగాభిమానులు, ఈ ప్రోమో చూసి అవాక్కవుతున్నారు. మింగలేక కక్కలేక తమలోతాము కుమిలిపోతున్నారు.

ఇలాంటి స్టఫ్ దొరికితే మీమర్స్ ఎంతలా రెచ్చిపోతారో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం బాస్ పార్టీ మీమ్స్ తో నిండిపోయింది. మన డీఎస్పీ అస్సలు మారలేదంటూ ఒకరు మీమ్ వదిలితే, మరొకరు పేరడీ చేసి వదిలారు. ఇలా ఈ ప్రోమోతో ఏ రేంజ్ లో ఆడుకోవాలో ఆ రేంజ్ లో వాడుకుంటున్నారు మీమర్స్.

రేపు విడుదల చేయబోతున్న బాస్ పార్టీ సాంగ్ హిట్టయితే ఓకే. లేదంటే మీమర్స్ మరోసారి రెచ్చిపోవడం ఖాయం, సోషల్ మీడియాలో ట్రోలింగ్ అంతకంటే ఖాయం.