దొరికితే నయనతార లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలని అనుకుంటున్నారు అబ్బాయిలు. అలాంటి అందాల భామ గర్ల్ ఫ్రెండ్ గా ప్రేమను అందించడమే కాదు, ప్రియుడి కోసం భారీగా సెలబ్రేషన్స్ చేసేంత మనసు ఎంతమంది అమ్మాయిలకు ఉంటుంది? నయనతార గ్లామర్ కు, ఆమె స్టేటస్ కు ఏ బడా పారిశ్రామికవేత్తనో ప్రియుడిగా చేసుకోగలదు. ఆమెను కాలు కింద పెట్టనీయకుండా చూసుకునేవాడు రావొచ్చు కూడా. చాలామంది హీరోయిన్లు అలానే సెట్ అవుతూ ఉంటారు. అయితే నయనతార మాత్రం అందుకు భిన్నం.
ఒక సాధారన సినిమా వ్యక్తి అయిన విఘ్నేష్ తో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ ఉంది. వీరిద్దరికీ పెళ్లి కూడా అయిపోయిందని చాలామంది అంటారు. అయితే వారు ఆ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది నయనతార.
ఏ పండగ సెలబ్రేషన్ అయినా కలిసి జరుపుకుని, అందుకు సంబంధించి ఫొటోలను పోస్టుచేస్తూ ఉంటారు వీరిద్దరూ. ఈ నేపథ్యంలో విఘ్నేష్ పుట్టినరోజు సందర్భంగా నయనతార ఈ పిక్ ను పోస్టుచేసింది. తమ బంధంలోని గాఢతను ఇలా చాటింది.