సూటిగా నూటొకటి…ఏజెన్సీలో రికార్డు

అభివృద్ధి ఎక్కడ ఉంది అని గుడ్డిగా ప్రశ్నించే వారికి సమాధానం ఎవరూ చెప్పలేరు. కానీ చూసేవారికి దానికి అనుభవించేవారికి మాత్రం కళ్ళకు ఎదురుగానే  కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఏజెన్సీ ప్రాంతాలలో వైద్య సదుపాయాలు పెద్దగా లేవు…

అభివృద్ధి ఎక్కడ ఉంది అని గుడ్డిగా ప్రశ్నించే వారికి సమాధానం ఎవరూ చెప్పలేరు. కానీ చూసేవారికి దానికి అనుభవించేవారికి మాత్రం కళ్ళకు ఎదురుగానే  కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఏజెన్సీ ప్రాంతాలలో వైద్య సదుపాయాలు పెద్దగా లేవు అన్న విమర్శలు వచ్చేవి. పురుడు పోసుకోవడానికి కూడా దిక్కు లేదని కూడా నిందించే వారు ఉన్నారు.

వైసీపీ ప్రభుత్వం నాడు నేడు అంటూ వైద్య రంగంలో తీసుకొస్తున్న విప్లవాత్మకమైన చర్యల ఫలితంగా ఏజెన్సీలో వైద్య రంగం రూపురేఖలు బాగా మారిపోయాయి అని చెప్పకతప్పదు. కొత్తగా ఏర్పాటు అయిన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల ఫలితంగా గిరిజనం ఆనందిస్తున్నారు.

ఇక్కడ ప్రసూతి సేవలకు సంబంధించి ఇద్దరు వైద్య నిపుణులను ప్రభుత్వం నియమించింది. దాంతో ప్రసూతి వైరాగ్యం బాధలు తప్పి మన్య సీమకు సంతాన సౌభాగ్యంగా పరిణమించాయి. కేవలం నెల రోజుల వ్యవధిలో ఈ ఆసుపత్రిలో ప్రసవాలు 101 జరిగాయి. అవన్నీ సాధారణ ప్రసవాలే కావడం విశేషం.

ఇక్కడ గర్భిణులకు ప్రత్యేక పరీక్షలతో పాటు మెరుగైన వైద్య సేవలను వైసీపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం వల్లనే ఇది సాధ్యపడింది అంటున్నారు. ఇలా మారుమూల ఉన్న ఏజెన్సీ ప్రజలకు ఉత్తమమైన వైద్యానికి  వైసీపీ ప్రభుత్వ గట్టి భరోసా ఇచ్చిందని అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి చూస్తే ప్రగతి అంటే నాలుగు భవనాలు కట్టడం కాదు, గ్రాఫిక్స్ పేరు చెప్పి ప్రచారం చేయడం అంతకంటే కాదు, సాధారణ జీవితాల్లో మారుమూల మన్యసీమలలో వెలుగులు నింపడం. అలాగే వారి జీవన ప్రమాణాలు పెంచడం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం ఇదే అసలైన ప్రగతి అని గిరిజనం  అంటున్న పరిస్థితి ఉంది.