ఎట్టకేలకూ తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ కొత్త కోర్డు సభ్యులు ఖరారు అయ్యారు. వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్న బోర్డుకు సంబంధించి సభ్యుల పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఈ శనివారమే వీరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రకు చెందినవారు టీటీడీ బోర్డులో సభ్యత్వాలను పొందారు. ఆ జాబితా ఇలా ఉంది.
కే.పార్థసారథి, యూవీ రమణమూర్తిరాజు, ఎం.మల్లికార్జునరెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్.శ్రీనివాసన్, తమిళనాడుకే చెందిన కృష్ణమూర్తి వైద్యనాథన్. ఇంకా.. పరిగెల మురళీకృష్ణ, జే.రామేశ్వరరావు, వేమిరెడ్డి ప్రశాంతి, బి.పార్థసారథిరెడ్డి, డాక్టర్ నిచిత ముప్పవరపు.
నాదెండ్ల సుబ్బారావు, డీ.పీ.అనంత, రాజేష్ శర్మ, రమేష్ శెట్టి, గుండవరం వెంకట భాస్కరరావు, మూరంశెట్టి రాములు, డి.దామోదర్రావు, చిప్పగిరి ప్రసాద్కుమార్, ఎంఎస్ శివశంకరన్, సంపత్ రవి నారాయణ, సుధామూర్తి, కుమారగురు, పుత్తా ప్రతాప రెడ్డి, కె.శివకుమార్.. వీరితో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు. ఇంకా నలుగురు స్థానాలు ఖాళీగా ఉంచారు. ఆ నియమకాలు జరగాల్సి ఉంది. తొలిసారి ఇంత భారీ టీమ్ తో జంబో బోర్డు ఏర్పడింది.