అటు జగన్… ఇటు బాబు…పవన్…

ఇపుడు రాజకీయం అంతా ఉత్తరాంధ్రా ఫోకస్ గా సాగుతోంది. ఈ మధ్యనే ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో రెండు రోజుల పాటు టూర్ చేసి వెళ్లారు. ఆయనతో భేటీ అయిన జనసేన అధినాయకుడు పవన్…

ఇపుడు రాజకీయం అంతా ఉత్తరాంధ్రా ఫోకస్ గా సాగుతోంది. ఈ మధ్యనే ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో రెండు రోజుల పాటు టూర్ చేసి వెళ్లారు. ఆయనతో భేటీ అయిన జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా పర్యటన పెట్టుకుని కొంత హడావుడి చేశారు.

ఉత్తరాంధ్రా మీద ప్రత్యేక దృష్టి పెట్టిన వైసీపీ కూడా ఇక్కడే సత్తా చాటాలనుకుంటోంది. ఈ నెల 23న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రాలోని చిట్టచివరి జిల్లా అయినా శ్రీకాకుళం పర్యటనకు వస్తున్నారు. ఆ రోజున ఆయన మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ సొంత నియోజకవర్గం అయిన నరసన్నపేట నుంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు.

జగన్ పర్యటన ఇలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉత్తరాంధ్రాకు మరో విడత టూర్ వేస్తున్నారు. ఆయన విజయనగరం జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారు. దాని కోసం పవన్ త్వరలోనే ఆ జిల్లాకు రానున్నారు.

వీరితో పాటుగానే ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఉత్తరాంధ్రా జిల్లా టూర్ కి రానున్నారు. ఆయన ఈ నెలాఖరులో మూడు రోజుల పాటు పార్వతీపురం మన్యం జిల్లా టూర్ చేయనున్నారు. ఆయన ఏజెన్సీలో పార్టీ బలోపేతం మీద దృష్టి పెడుతూ ఈ పర్యటన చేస్తున్నారు. ఇలా ముగ్గురు కీలక నాయకులు వరసబెట్టి ఒకే సమయంలో ఉత్తరాంధ్రా వస్తూండడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.