పాయల్ తప్ప ఎవ్వరూ సెట్ కాలేదు

యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన సినిమా 'మంగళవారం'. పాయల్ రాజ్‌ పుత్, 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం సురేష్…

యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన సినిమా 'మంగళవారం'. పాయల్ రాజ్‌ పుత్, 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం సురేష్ వర్మతో కలిసి అజయ్ భూపతి 'ఎ' క్రియేటివ్ వర్క్స్ సంస్థ చిత్రాన్ని నిర్మించింది. నవంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా అజయ్ భూపతి మీడియాతో మాట్లాడారు. 

ఈ కథ ఐడియా ఎప్పుడు వచ్చిందనేది పర్టిక్యులర్ గా చెప్పలేను. కానీ ఈ కథ చేయాలనుకున్నాక మరొక కథపై మనసు వెళ్ళలేదు. ఇటువంటి సినిమాకు దర్శకత్వం వహించడం అంత సులభం కాదు. ప్రొడక్షన్ అండ్ టెక్నికల్ వేల్యూస్, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ వంటివి చాలా ఉంటాయి. విజువలైజేషన్ నాకు తప్ప సినిమాటోగ్రాఫర్ కి కూడా తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా అంతే!

సినిమాలో పాయల్ క్యారెక్టర్ చూసి ప్రేక్షకులందరూ షాక్ అవుతారు. జీవితంలో మళ్ళీ చేయలేనటువంటి పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో చేసింది. పాయల్ కు ముందు సుమారు 40, 50 మందిని ఆడిషన్ చేశా. కానీ ఎవ్వరూ సెట్ కాలేదు. అలాంటి టైమ్ లో పాయల్ తనే మెసేజ్ చేసింది. తాను చేస్తా అంటూ. తనకు నా మీద ఉన్న నమ్మకం. ఆల్రెడీ 'ఆర్ఎక్స్ 100' టైమ్ లో పాయల్ ధైర్యంగా ముందడుగు వేసింది. ఇప్పుడూ అంతే!

'మంగళవారం'లో జీరో ఎక్స్‌పొజింగ్. నా జీవితంలో ఒక్క వల్గర్ షాట్ తీయలేదు.  సినిమాలో ఒక్క ట్విస్ట్ కాదు, చాలా ఉన్నాయి. మాస్క్ వెనుక ఎవరు ఉన్నారో చూస్తే షాక్ అవుతారు. లాస్ట్ 45 నిమిషాలు నెక్స్ట్ లెవల్ ట్విస్టులు ఉంటాయి. మ్యూజిక్ కూడా అద్భుతం. 'రంగస్థలం' చిత్రానికి నేషనల్ అవార్డు అందుకున్న సౌండ్ డిజైనర్ ఎంఆర్ రాధాకృష్ణ మంగళవారానికి నెక్స్ట్ లెవల్ లో చేశారు. థియేటర్లలో భారీ సినిమా చూస్తున్నట్లు ఉంటుంది.   

సినిమాకు ఒక్క కట్ కూడా ఇవ్వలేదు. విజువల్ గానీ, సౌండ్ గానీ తీయమని చెప్పలేదు. 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా రేంజ్ నేను ముందు ఊహించకపోతే 20 కోట్లు ఖర్చు పెట్టను. మంగళవారం' సినిమాకు పొడిగింపు అయితే ఉంటుంది. సీక్వెల్, ప్రీక్వెల్, ఫ్రాంచైజీ… ఏం అంటారో నాకు తెలియదు. ఎక్స్‌టెన్షన్ అయితే ఉంటుంది.