ఆహాలో బాలయ్య అన్ స్టాపబుల్ అన్నది ఓ క్రేజీ ప్రోగ్రామ్. అన్ స్టాపబుల్ సీజన్ వన్ తో బాలయ్య పేరు మారుమోగిపోయింది. ఆహా కు ఐకానిక్ ప్రోగ్రామ్ గా మారింది. తరువాత అదే ఊపుతో సీజన్ 2 చేసారు.
అయితే సెలబ్రిటీలు సరిగ్గా దొరకలేదు. పైగా బాలయ్య షూట్ షెడ్యూళ్లకు, ఈ షో షూట్ కు టైమింగ్స్ సెట్ కాలేదు. మొత్తానికి సీజన్ 2 అయింది అనిపించి ఆపేసారు.
ఇప్పుడు సీజన్ 3 ప్లాన్ చేయడం లేదు కానీ కొన్ని స్పెషల్ ఇంటర్వూలు ప్లాన్ చేసి, స్పెషల్ ఎపిసోడ్ లు ప్రసారం చేయాలని ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవిని గెస్ట్ గా తీసుకువచ్చి బాలయ్యతో ముచ్చట్లు పెడతారని తెలుస్తోంది. ఈ మేరకు ఆహా తరపున అల్లు అరవింద్ చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయినట్లు తెలుస్తోంది.
బాలయ్య, చిరు డేట్ లు సెట్ అయితే ఈ ఎపిసోడ్ తయారు చేసి, దసరా లేదా న్యూ ఇయర్ లాంటి క్రేజీ డేట్ కు ప్రసారం చేయాలన్నది ఆహా ప్లాన్. అలాగే ఇలాంటి స్పెషల్ ఎపిసోడ్ లు అప్పుడు అప్పుడు చేస్తారట. అంతెే తప్ప సీజన్ 3 అనేది ప్లాన్ లో లేదట.