ఇప్పటికైనా మారండి బిగ్ బాస్

సగంరోజులు గడిచిపోయాయి. సగం ఎపిసోడ్స్ అయిపోయాయి. ఇకనైనా స్టార్ మా నిర్వహకులు మారాలని డిమాండ్ చేస్తున్నారు బిగ్ బాస్ ప్రేమికులు. మొదటి రెండు సీజన్లను ఫుల్ గా ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు, సీజన్-3కు వచ్చేసరికి…

సగంరోజులు గడిచిపోయాయి. సగం ఎపిసోడ్స్ అయిపోయాయి. ఇకనైనా స్టార్ మా నిర్వహకులు మారాలని డిమాండ్ చేస్తున్నారు బిగ్ బాస్ ప్రేమికులు. మొదటి రెండు సీజన్లను ఫుల్ గా ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు, సీజన్-3కు వచ్చేసరికి మాత్రం చిరాకుపడుతున్నారు. కంటెస్టంట్లకు ఇస్తున్న స్కిట్లు, పెడుతున్న పోటీలు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు… ఇవన్నీ కలిసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి.

ఇప్పటివరకు ప్రవేశపెట్టిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలన్నీ తుస్సుమన్నాయి. చివరికి శిల్ప చక్రవర్తి కూడా వచ్చిన 2 వారాలకే సూట్ కేస్ సర్దేయడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎంత పేలవంగా ఉన్నాయనే విషయం అర్థమౌతూనే ఉంది. ఇకనైనా ఇలాంటి చీప్ కార్డులు కాకుండా.. మంచి ట్రంప్ కార్డుల్ని హౌజ్ లోకి పంపించమంటూ ఆన్ లైన్ లో ఆవేదన వ్యక్తంచేస్తున్నారు ప్రేక్షకులు.

నిజానికి బిగ్ బాస్ నిర్వహకులకు కూడా కాస్త క్రేజ్ ఉన్న వ్యక్తుల్ని, హాట్ భామల్ని హౌజ్ లోకి పంపించాలనే ఉంది. కానీ మొదటి 2 సీజన్లతో పోలిస్తే.. సీజన్-3కు వచ్చేసరికి బడ్జెట్ పరిమితులు విధించారు. ఉన్నంతలోనే సీజన్ ను ముగించాలని స్టార్ యాజమాన్యం కండిషన్ పెట్టింది.

భారీగా డబ్బులు పెట్టకపోతే క్రేజీ స్టార్స్ రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అదే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-3ను నీరసంగా మార్చేసింది. హీరోయిన్లు ఈ కార్యక్రమం వైపు రాకపోవడానికి ప్రధాన కారణం ఇదే. తమన్న సింహాద్రి, శిల్ప చక్రవర్తి లాంటివాళ్లు “వైల్డ్ కార్డులు”గా మారడానికి కూడా కారణం ఇదే.

ఇప్పటివరకు అయిందేదో అయిపోయింది. 57 ఎపిసోడ్స్ అయిపోయాయి. కనీసం మిగతా ఎపిసోడ్స్ విషయంలోనైనా నిర్వహకులు కాస్త కేర్ తీసుకుంటే మంచిది. కంటెస్టెంట్లకు ఇచ్చే టాస్కుల్లో కొత్తదనం చూపించాలి, క్రేజీ భామల్ని వైల్డ్ కార్డులుగా మార్చాలి. అప్పుడే బిగ్ బాస్ పరువు అంతో ఇంతో నిలబడుతుంది. స్టార్ మాకు టీఆర్పీ కూడా వస్తుంది. లేదంటే తెలుగులో ఇదే ఆఖరి సీజన్ అనుకోవాల్సి వస్తుంది.

తన భయం.. రాష్ట్రంపై రుద్దితే ఎలా?