కార్యకర్తలు కేసుల్లో ఉండాలనేదే చంద్రబాబు కుట్ర!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైన కొత్త ప్రణాళిక రచించారు. Advertisement “ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తుంది..” అనే ప్రచారం…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైన కొత్త ప్రణాళిక రచించారు.

“ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తుంది..” అనే ప్రచారం స్వయంగా తాము చేయాల్సిన అవసరం లేకుండా.. మౌత్ పబ్లిసిటీ ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి ఆయన స్కెచ్ వేశారు. అయితే అందుకు తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలను.. అమాయకులైన పార్టీ అభిమానులను సమిధలుగా చేసే కుట్రపన్నారు. ఇంతకూ ఏమిటా స్కెచ్? ఏమిటి వివరాలు అని పరిశీలిస్తే…

చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఇలాంటి పర్యటనలో నాయకులు సహజంగా తమ పార్టీ శ్రేణులకు ప్రేరణ ఇవ్వడానికి,  వారిలో ఉత్సాహం నింపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు ఓ అడుగు ముందుకేసి వారిని రెచ్చగొట్టడమే తన పనిగా పెట్టుకున్నట్టున్నారు. మీ సెల్ ఫోన్ ని ఆయుధంగా వాడండి.. అని చంద్రబాబు పిలుపు ఇస్తున్నారు.

పార్టీ కార్యకర్తలు సెల్ ఫోన్ ద్వారా జగన్ ప్రభుత్వ అరాచకాల గురించి ప్రతిరోజు పది మందికి ఫోన్ చేసి చెప్పాలని.. ప్రతిరోజు అందరికీ మెసేజీలు పెడుతూ ఉండాలని ఆయన మార్గదర్శనం చేస్తున్నారు. అంటే రాష్ట్రంలోని యావత్తు కార్యకర్తలని ఆయన సోషల్ మీడియా కుట్రదారుల కింద మారుస్తున్నారన్నమాట.

చంద్రబాబు నాయుడు ఇన్ డైరెక్ట్ గా కార్యకర్తలను కేసుల్లో ఇరికించే ఆలోచనతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సరికొత్త చట్టాలు.. సోషల్ మీడియాలో వ్యాప్తి చేసే అబద్ధపు పోస్టులను సహించేలా లేవు. వారి మీద కేసులు నమోదు అవుతాయి. అరెస్టులు తప్పవు. శిక్షలు కూడా ఉంటాయి.

అమాయకంగా ఏది పడితే అది అందరికీ మెసేజ్లుగా వ్యాప్తి చేస్తే.. కేసుల్లో ఇరుక్కునేది కార్యకర్తలు మాత్రమే.. వారిని కాపాడడానికి చంద్రబాబు నాయుడు రాడు అనేది సత్యం. అయితే చంద్రబాబుకు కావాల్సింది కూడా అదే! 

గ్రామాల్లో ప్రతిచోట తమ కార్యకర్తలు అరెస్ట్ అవుతూ ఉంటే.. వారికి శిక్షలు పడుతూ ఉంటే.. జగన్ ప్రభుత్వం నోరెత్తిన వారిని అందరిని అరెస్టు చేస్తూ ఉందనే ప్రచారం ప్రజల్లో బాగా జరుగుతుంది. కార్యకర్తలు జైలుకు పోతే పోయారు.. జగన్కు వ్యతిరేకంగా అలాంటి మౌత్ టాక్ పబ్లిసిటీ కావాలనేది చంద్రబాబు కోరిక. అందుకే కుట్రపూరితంగా ఇలా ప్రజలను రెచ్చగొడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

తాను మళ్ళీ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వస్తే చాలు.. పార్టీని అభిమానించే వాళ్లు పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు అందరూ సర్వనాశనమైనా  పరవాలేదు అనుకునేదే చంద్రబాబు ధోరణి అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.