ఎలిమినేట్ చేయడానికే వైల్డ్ కార్డ్ ఎంట్రీలా!

రానురాను వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు కూడా విలువలేకుండా పోతోంది. అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటేనే బలమైన ప్రత్యర్థి అని అర్థం. మధ్యలో బరిలో దిగినప్పటికీ చివరివరకు పోరాడే వీరుడు లాంటోడని అర్థం. ఎంతో…

రానురాను వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు కూడా విలువలేకుండా పోతోంది. అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటేనే బలమైన ప్రత్యర్థి అని అర్థం. మధ్యలో బరిలో దిగినప్పటికీ చివరివరకు పోరాడే వీరుడు లాంటోడని అర్థం. ఎంతో పవర్ ఫుల్ గా, మరెంతో ఎట్రాక్టివ్ గా ఉండాల్సిన వైల్డ్ కార్డ్ ఎంట్రీల్ని తుస్సుమనిపిస్తోంది బిగ్ బాస్ సీజన్-3.

హీరోయిన్లు, హాట్ బాంబ్ లు, పొలిటీషియన్లు వస్తారనుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద ట్రాన్స్ జెండర్ ను పంపించారు బిగ్ బాస్ నిర్వహకులు. పోనీ దాన్నయినా కొనసాగించారా అంటే అదీలేదు. వారంరోజులకే “వైల్డ్” కార్డ్ కాస్తా తుస్సుమనింది. ఆ వెంటనే మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా శిల్పా చక్రవర్తిని హౌజ్ లోకి పంపించారు. ఆల్రెడీ ఫేడవుట్ అయిన ఆమె బిగ్ బాస్ హౌజ్ ను కూడా ఫేడవుట్ చేసి పడేసింది. సో.. ఇప్పుడు ఆమెను కూడా ఎలిమినేట్ చేశారు.

అవును.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌజ్ లోకి ప్రవేశించిన 2 వారాలకే శిల్పా చక్రవర్తి ఎలిమినేట్ అయింది. ఈరోజు రాత్రికి ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ఉంది. ఎప్పట్లానే ఈవారం ఎలిమినేషన్ కూడా లీక్ అయింది. పునర్నవి, మహేష్ విట్టా, హిమజ, శిల్ప, శ్రీముఖి ఎలిమినేషన్ రౌండ్ కు నామినేట్ అవ్వగా.. వీళ్ల నుంచి శిల్ప చక్రవర్తి ఎలిమినేట్ అయింది. శిల్ప ఔట్ అనే విషయం 24 గంటల ముందే సోషల్ మీడియాలో అందరికీ తెలిసిపోయింది. ఇక ఈరోజు రాత్రికి టీవీల్లో జరగబోయే తంతు అంతా జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే.

ఈ సంగతి పక్కనపెడితే.. ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల విలువపై ఆసక్తికర చర్చ మొదలైంది. తమన్న సింహాద్రి, శిల్ప చక్రవర్తి లాంటి వాళ్లకు వైల్డ్ కార్డ్ ట్యాగ్స్ ఎలా ఆపాదిస్తారంటూ నిర్వహకులపై విమర్శలు గుప్పిస్తున్నారు జనం. కాస్త ఆసక్తిరేకెత్తించేలా, కవ్వించేలా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండాల్సింది పోయి.. షోను మరింత దిగజార్చేలా ఈ ఎంట్రీలు ఉంటున్నాయని తిడుతున్నారు. శిల్ప వెళ్లిపోయిన తర్వాత వచ్చే మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎలా ఉండబోతోందో!

మారని తీరు.. అదే కుట్రల, కుతంత్రాల రాజకీయం!