విశాఖకు జగనే ముందు?

ఎంతెంత దూరం..రాజధాని నగరం అంటే ఇంకొంత దూరం అని సమాధానం వస్తోంది. విశాఖను పాలనారాజధానిగా ప్రకటిస్తూ ఏడు నెలల క్రితం వైసీపీ నిర్ణయం తీసుకుంది. నాడు శాసనమండలిలో దీన్ని తొలి ఆటంకం ఎదురైంది. ఆ…

ఎంతెంత దూరం..రాజధాని నగరం అంటే ఇంకొంత దూరం అని సమాధానం వస్తోంది. విశాఖను పాలనారాజధానిగా ప్రకటిస్తూ ఏడు నెలల క్రితం వైసీపీ నిర్ణయం తీసుకుంది. నాడు శాసనమండలిలో దీన్ని తొలి ఆటంకం ఎదురైంది. ఆ తరువాత కరోనా మహమ్మారితో ప్రక్రియ కొంత ఆలస్యం అయింది.

ఇపుడు ఆటంకాలు ఒక్కోటీ తొలగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రెండవసారి శాసనమండలికి బిల్లు పంపించిన సర్కార్ తన బాధ్యతను నెరవేర్చింది. అక్కడ బిల్లు ఆమోదం పొందినా పొందకపోయినా నెల రోజుల వ్యవధిలో ఆటోమేటిక్ గా బిల్లు ఆమోదం పొందినట్లేనని భావించాలి.

దీంతో విశాఖ రాజధాని దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని అంటున్నారు. అయితే అద్భుతమైన ముహూర్తం మాత్రం విజయదశం శుభ వేళ అక్టోబర్ 25న వుంది అంటున్నారు. ఆనాటికి మొత్తం పాలనంతా విశాఖకు వస్తుంది.

ఇక ఇప్పటికి చూస్తే కచ్చితంగా వంద రోజుల సమయం ఉంది. ఈలోగా ముందు ముఖ్యమంత్రి ఆఫీస్ విశాఖ తరలివస్తుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మధ్యనే సీఎంవోకు చెందిన కొంత ఫర్నిచర్ కూడా విశాఖలోని గ్రేహౌండ్స్ భవనాలకు తరలించారని అంటున్నారు.

దాన్ని బట్టి చూస్తే   ముందే జగన్ విశాఖకు వస్తారని, ఆ తరూవాత ఒక్కోటిగా మొత్తం పాలనంతా విశాఖకు షిఫ్ట్ అయ్యేటప్పటికి అసలైన ముహూర్తం విజయదశమి వస్తుందని అంటున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే పాలన, అదే రాజధాని  కాబట్టి జగన్ కనుక విశాఖకు  వచ్చేస్తే ఆ రోజు నుంచే వైజాగ్ కి రాజధాని కళ వచ్చినట్లేనని అంటున్నారు.

హరీష్ శంకర్ తో సినిమా చేస్తాను