ఆంధ్రలో ఎన్నికలు ముగిసి,వైకాపా అధికారంలోకి వచ్చిన తరుణం. జనసేనకు ఒకే ఒక్క సీటు వచ్చింది. ఆ పార్టీ నేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓఢిపోయారు. అలాంటి సమయంలో ఓ రోజు.
లోకేషన్…పవన్ కళ్యాణ్ పోలిన పాత్ర ఫార్మ్ హవుస్
పవన్ కళ్యాణ్ ను పోలిన పాత్ర ధారి కూర్చుని వున్నారు. అన్న మెగాస్టార్ ను పోలిన పాత్ర ఎంట్రీ వచ్చారు. వస్తూనే..
-నేను ముందే చెప్పాను. రాజకీయాల్లోకి వెళ్ల వద్దని. విన్నావా.. నేను నీకన్నా ముందే మెగాస్టార్ ను. నేను పార్టీ పెడితే ఏం జరిగింది? నేను కొన్ని సీట్లు అయినా తెచ్చుకున్నాను. నీకు అదీ లేదు. ఈ జనాన్ని నమ్మడానికి లేదు.
-అన్నయ్యా..అదీ..గురూజీ చెప్పారు. అంతా బాగుంటుందన్నారు.
-అవును నేను చెప్పినట్లే జనం బాగా వచ్చారు. నేను తయారుచేసిన స్పీచ్ లు బాగానే విన్నారు కదా..
-చాలు చాల్లేవయ్యా..నువ్వు అన్నీ ఇలాగే చెబుతావు. అ….వాసి సినిమా టైమ్ లో కూడా ఇలాగే చెప్పావు..ఏం జరిగింది?
ఇంతలో బండ్ల గణేష్ ను పోలిన పాత్ర ఎంట్రీ…
అబ్బబ్మా..అన్నా..ఏం వర్రీ కాకన్నా..అంతా అదిరిపోతుంది అన్నా. నువ్వు చూస్తావు కదా అన్నా…2024 కు మనదే విజయం అన్నా. నువ్వుసిఎమ్ అన్నా. ఓ హగ్ ఇయ్యన్నా.. అంటూ కౌగిలించుకుంటారు.
…..
ఆర్జీవీ తీస్తున్న పవర్ స్టార్ సినిమాలో ఇది ఓ సీన్ అని టాలీవుడ్ లో గ్యాసిప్ వినిపిస్తోంది. సినిమా తయారై విడుదలయితే అసలు సంగతి తెలిసిపోతుంది.