‘మంగళవారం’ అంటున్న దర్శకుడు

ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీ జ‌నాల దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు అజ‌య్ భూపతి. మహాసముద్రం సినిమాను డిఫరెంట్ గా ప్లాన్ చేసినప్పటికీ ఎక్కడో మిస్ ఫైర్ అయింది. ఆ తరువాత మరో…

ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీ జ‌నాల దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు అజ‌య్ భూపతి. మహాసముద్రం సినిమాను డిఫరెంట్ గా ప్లాన్ చేసినప్పటికీ ఎక్కడో మిస్ ఫైర్ అయింది. ఆ తరువాత మరో కానెప్ట్ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. పక్కా రగ్డ్, రస్టిక్ సినిమాను విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నాడు.

ఈ సినిమా పక్కా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ థ్రిల్లర్. పక్కా హీరో, విలన్ అని కాకుండా అన్నీ కీలకంగా వుండే రెండు డజ‌న్ల పాత్రలు వుంటాయి. అజ‌య్ భూపతి దర్శకత్వం మాత్రమే కాకుండా నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించబోతున్నాడు. 

ఈ నెలాఖరు నుంచి సెట్ మీదకు వెళ్లే ఈ సినిమా దాదాపు 80 రోజుల షూటింగ్ డేస్ అందులోనూ 30 రోజులు నైట్ వర్కింగ్ డేస్ తో కాస్త భారీగానే వుంటుంది.

సినిమాలో కేవలం తెలుగు నటులు మాత్రమే కాకుండా బాలీవుడ్ తో సహా ఇతర భాషల నటులు కూడా వుంటారని బోగట్టా. మొత్తం మీద మహాముద్రం ఇచ్చిన డిస్సపాయింట్ మెంట్ నుంచి తేరుకుని మళ్లీ మరో మంచి ప్రయత్నం చేస్తున్నాడు అజ‌య్ భూపతి.