నాడూ నేడుకీ రాజకీయ గ్రహణం

దేవుడు వరమిచ్చాడు, ప్రభుత్వం పాఠశాలల  రూపు రేఖలు మార్చడానికి అద్భుత అవకాశం ఇచ్చాడు. సర్కారీ బడులు అంటే చవుడు పట్టిన గోడలు, కూలిపోవడానికి సిద్ధంగా  ఉన్న  పై కప్పులు, సరిగ్గా కూర్చునేందుకు కూడా వీలు…

దేవుడు వరమిచ్చాడు, ప్రభుత్వం పాఠశాలల  రూపు రేఖలు మార్చడానికి అద్భుత అవకాశం ఇచ్చాడు. సర్కారీ బడులు అంటే చవుడు పట్టిన గోడలు, కూలిపోవడానికి సిద్ధంగా  ఉన్న  పై కప్పులు, సరిగ్గా కూర్చునేందుకు కూడా వీలు కానీ గదులు, తాగేందుకు నీళ్ళు దొరకని దుస్ధితి, ఆఖరుకు ఆడపిల్లలు అవసరం తీర్చుకునేందుకు కూడా మరుగు దొడ్లు లేని దారుణం. ఇది కదా ఇంతవరకూ అంతా చూసింది.

వైసీపీ సర్కార్ అధికారంలోకి రావడంతోనే ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ పాఠశాలకు అద్భుతమైన రూపం తీసుకురావాలనుకున్నారు. వాటిని సైతం కార్పొరేట్ తరహాలో అభివ్రుధ్ధి చేయాలని తపన పడుతున్నారు. మరి ఇక్కడ కూడా రాజకీయాలు చోటు చేసుకోవడం అంటే బాధాకరమే.

విజయనగరం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలోని  జియ్యమ్మవలస మండలంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో కేవలం రాజకీయ కారణల వల్ల ఆ స్కూల్ వచ్చిన నిధులు  మరో స్కూల్ కి వెళ్ళిపోయాయి. దాదాపు 19 లక్షల రూపాయల నిధులతో పాఠశాల అద్భుతంగా రూపురేఖలు మార్చుకోవాల్సిఉంది.

అయితే పేరెంట్స్ కమిటీలకు కూడా రాజకీయ రంగులు ఉంటాయని ఇక్కడే తెలిసింది. విపక్ష రాజకీయంతో  ఇక్కడ పాఠశాల అభివ్రుధ్ధి కంటే పాలిటిక్సే పరమార్ధం అయింది. దాంతో ఈ నిధులు వేరే పాఠశాలకు మళ్ళిపోగా అసలైన అన్యాయం మాత్రం అభం శుభం తెలియని చిన్నారులకు జరిగింది. ఇలాగే మరికొన్ని చోట్లా జరుగుతుంటే ఇక నాడే తప్ప నేటికి దిక్కేది అంటున్నారంతా.

ఇదే విధంగా అభువ్రుధ్ధిని రాజకీయాలతో అడ్డుకుంటే  వాటి ఫలాలు అందుకోలేని బాధితులు ప్రజలే అవుతారన్న ఇంగితం పార్టీల నేతలకు ఉండాలి మరి. అది లేని నాడు  దేవుడు దిగి వచ్చినా వరం ఇచ్చినా చేతికీ నోటికీ మధ్య కూడా రాజకీయం రొచ్చు తగిలి పరమాన్నం కూడా మట్టిలో పడిపోతుంది.

హరీష్ శంకర్ తో సినిమా చేస్తాను