ఎమ్మెల్యేలు.. బీజేపీ లీకులు నిజమేనా?

తమ పార్టీలోకి టీఆర్ఎస్ నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు రావడానికి రెడీగా ఉన్నారంటూ బీజేపీ నేతలు మీడియాకు లీకులు ఇస్తూ ఉన్నారు. పన్నెండు మంది అంటూ ఒక నంబర్  ను కూడా ప్రకటిస్తూ ఉన్నారు…

తమ పార్టీలోకి టీఆర్ఎస్ నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు రావడానికి రెడీగా ఉన్నారంటూ బీజేపీ నేతలు మీడియాకు లీకులు ఇస్తూ ఉన్నారు. పన్నెండు మంది అంటూ ఒక నంబర్  ను కూడా ప్రకటిస్తూ ఉన్నారు కమలం పార్టీ నేతలు. అయితే తెలంగాణలో ఇప్పుడప్పుడే ఎన్నికలు వచ్చే అవకాశం లేని నేపథ్యంలో ఇవి ఉత్తుత్తి మాటలేనా? అనే సందేహాలు సహజంగానే కనిపిస్తున్నాయి.

తెలంగాణలో లోక్ సభ సార్వత్రిక ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన విజయాలను సాధించింది. వాటి వెనుక రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. ఏదేమైనా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనంటూ సవాల్ విసరడానికి అయితే భారతీయ జనతా పార్టీకి సార్వత్రిక ఎన్నికలు అవకాశం ఇచ్చాయి. ఈ నేపథ్యంలో కమలం పార్టీ ఉత్సాహంగా వ్యవహరిస్తూ ఉంది.

అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారంటూ ప్రచారం చేస్తూ ఉంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరగడం, కొంతమంది నేతలు అసంతృప్తికి కూడా గురికావడంతో ఈ ఊహాగానాలకు మరింత ప్రచారం వస్తూ ఉంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ వెళ్లి బీజేపీ ఎంపీ అరవింద్ తో సమావేశం కావడంతో.. రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. అయితే తను కేసీఆర్ కు శిష్యుడిని అంటూ, ఆయన తనకు గాడ్ ఫాదరంటూ షకీల్ ఒక ప్రకటన చేశారు. తను పార్టీ మారడం లేదని ఆయన ప్రకటించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్లే అనేక మంది తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరారు. దానికి కారణం ఏమిటంటే.. అధికారం. అలాంటి అధికారాన్ని వదిలిపెట్టుకుని, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలోకి చేరాతారంటే అదంత నమ్మశక్యంగా కనిపించడం లేదు. ఎన్నికలకు ఏ రెండు మూడు నెలలు ముందు.. అప్పటి పరిస్థితులను అనుసరించి నేతలు జెండాలు పీకేస్తారు కానీ, ఇలాంటి దశలో అధికారంలో ఉన్న పార్టీల నుంచి ఫిరాయింపులు మాత్రం జరుగుతాయని ఎవరూ గట్టిగా చెప్పలేకపోతూ ఉన్నారు.

నీ సినిమా గురించి అడిగి కడిగి పారేస్తా.. హీరో