విశాఖ ఉత్సవ్ పేరిత భారీ ఎత్తున విశాఖలో కార్యక్రమాలు చేయడానికి వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. రెండేళ్ళ పాటు కరోనా ఉండడంతో ఉత్సవాలకు ఆటంకం ఏర్పడింది. ఈసారి దాన్ని బ్రేక్ చేస్తూ అంగరంగ వైభవంగా విశాఖ ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
డిసెంబర్ 29,30 తేదీలలో విశాఖ ఉత్సవ్ నిర్వహించడం ద్వారా పర్యాటక శోభను మరింత ఇనుమడింపచేయాలని చూస్తున్నారు. శీతాకాలంలో టూరిస్టుల సందడి విశాఖకు ఎక్కువగా ఉంటుంది. ఏజెన్సీకి అధిక సంఖ్యలో టూరిస్టులు వస్తారు.
దానికి కొనసాగింపుగా ఇయర్ ఎండింగ్ ప్రొగ్రాం గా విశాఖ ఉత్సవ్ ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తునారు. దీని మీద ప్రయాటక ప్రమోషన్ కౌన్సిల్ ప్రణాళికను రూపొందిస్తోంది. విశాఖ ఉత్సవ్ తో టూరిజం ఫోకస్ ని మరింత పెంచాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఆ దిశగా సన్నాహలు సాగుతున్నాయి.
విశాఖ ప్రయారిటీ బాగా పెంచాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇది మరో అవకాశంగా భావిస్తున్నారు. ఇప్పటికే విశాఖ ప్రాధాన్యతను పెంచే విధంగా అనేక కార్యక్రమాలు డిజైన్ చేస్తున్న క్రమంలో మరింతగా విశాఖ సిటీ ఫోకస్ అయ్యేలా ప్రభుత్వం భారీ యాక్షన్ ప్లాన్ తో ముందుకు వస్తోంది.