అవును మరో వివాదాస్పద సినిమా రాబోతోంది. ఇది పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు షాకింగ్ న్యూస్. తాజాగా రాంగోపాల్‌వర్మ తీస్తున్న వెబ్ సిరీస్ తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో కొత్త సినిమా కూడా ఆ స్థాయిలో సంచలనం కలిగించే అవకాశాలున్నాయి.
పవన్‌కల్యాణ్ మాజీ భార్య, నటి అయిన రేణూదేశాయ్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సరదాగా ఆమె అన్నప్పటికీ…విషయం మాత్రం సీరియస్‌గానే పరిగణించాలంటున్నారు. పవన్, రేణూ దంపతులకు అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు. వ్యక్తిగత కారణాలతో వారిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఫూణేలో రేణూ పిల్లలతో కలిసి ఉంటున్నారు.
తాను మళ్లీ పెళ్లి చేసుకుంటున్నట్టు 2018లో రేణూ ప్రకటించారు. దీంతో పవన్ అభిమానులు ఆమెను టార్గెట్ చేసి… విపరీతంగా ట్రోల్ చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఒక దశలో రేణూ కన్నీటిపర్యంతమయ్యారు. తనకంటూ వ్యక్తిగత జీవితం ఉండదా అని ఆమె ప్రశ్నించిన విషయం తెలిసిందే.
తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇప్పటికీ పెళ్లికి సంబంధించి తనను కొందరు ప్రశ్నిస్తూ విసిగిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. అలా తనను అడిగే వాళ్ల అనుమానాల్ని నివృత్తి చేసేందుకు పెళ్లిగోల అనే బయోపిక్ తీస్తానని సరదాగా హెచ్చరించారు.
అదేంటో గానీ, తాను పెళ్ళి చేసుకున్నా, చేసుకోకపోయినా కొందరికి సమస్యగా ఉందని రేణూ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అలాంటి వాళ్ల కోసం పెళ్లి గోల అనే బయోపిక్ తీసి క్లారిటీ ఇస్తే సరిపోతుందేమో అంటూ వ్యంగ్యంగా అన్నారు. తన పర్సనల్ లైఫ్ గురించి ఎందుకింతగా రచ్చ చేస్తున్నారో అర్ధం కావడం లేదని రేణూ చెప్పుకు పోయారు.