పూజా హెగ్డే కట్టిన చీర రేటు ఎంతో తెలుసా?

సెలబ్రిటీలు కాస్ట్ లీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. కేవలం వాళ్ల లైఫ్ స్టయిల్ మాత్రమే కాదు, యాక్ససిరీస్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. చిన్న ఫంక్షన్ కు హాజరవ్వడానికి కూడా లక్షల్లో ఖర్చు…

సెలబ్రిటీలు కాస్ట్ లీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. కేవలం వాళ్ల లైఫ్ స్టయిల్ మాత్రమే కాదు, యాక్ససిరీస్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. చిన్న ఫంక్షన్ కు హాజరవ్వడానికి కూడా లక్షల్లో ఖర్చు ఉంటుంది. తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే వేసుకున్న ఓ డ్రెస్ కూడా ఇలానే హాట్ టాపిక్ గా మారింది.

రీసెంట్ గా ఓ అవార్డ్ ఫంక్షన్ కు మోడ్రన్ శారీలో హాజరైంది పూజా హెగ్డే. పసుపు రంగు చీర, బంగారు రంగు జాకెట్ తో చూడ్డానికి సింపుల్ గా అనిపించే ఈ డ్రెస్ ఖరీదు అక్షరాలా 48వేల రూపాయలు. డిజైనర్ అర్పితా మెహతా ఈ డ్రెస్ ను డిజైన్ చేశారు.

ఇదే హీరోయిన్ కొన్ని నెలల కిందట లాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. అందులో షో స్టాపర్ గా నిలిచిన పూజా హెగ్డే.. ఏకంగా 2 లక్షల రూపాయల ఖరీదైన లెహంగా ధరించి అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. ట్రెడిషనల్ లుక్స్ లో పూజా హెగ్డే తక్కువగా కనిపిస్తుంది. అయితే అలా కనిపించిన ప్రతిసారి అది కాస్ట్ లీ వ్యవహారమే.

కేవలం దుస్తుల విషయంలోనే కాదు, పూజా హెగ్డే వాడే యాక్ససిరీస్ కూడా చాలా కాస్ట్ లీ. చెప్పులు, గాగుల్స్, వాచీలు అన్నీ లక్షల్లో ఉంటాయి. ఆమె రెగ్యులర్ గా వాడే లూయీస్ ఉటాన్ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు అక్షరాలా 2 లక్షల 60వేల రూపాయలు. సో.. ఈ లెక్కన చూసుకుంటే రీసెంట్ గా ఆమె ధరించిన పసుపు రంగు డ్రెస్ చీప్ అనే అనుకోవాలి మరి.