ఇండస్ట్రీలో కొత్త కొత్త కాంబినేషన్ సినిమాలే కాదు, కొత్త కొత్త బ్యానర్లు కూడా కాంబినేషన్లతో వస్తున్నాయి. పెద్ద పెద్ద నిర్మాతలు కలిసి ఓ బ్యానర్ పెట్టడం అన్నది కొత్త ఐడియాగా మారుతోంది. లేటెస్ట్ గా అలాంటి బ్యానర్ ఒకటి తయారవుతోందని తెలుస్తోంది.
దర్శకులు క్రిష్, నిర్మాత రాజీవ్ రెడ్డి కలిసి చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మించే పనిలో పడ్డారని తెలుస్తోంది. ఈ సినిమాలకు డిస్ట్రిబ్యూటింగ్ పార్టనర్లుగా యువి వంశీ, దిల్ రాజు వ్యవహరిస్తారు. ఇలా పెద్దవాళ్లు అంతా కలిసి చిన్న, మీడియం సినిమాలు నిర్మిస్తారు.
ఇటీవల కృష్ణలీల సినిమా అందించిన రవికాంత్ పేరపు తో తొలి సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణంలో వున్న అవసరాల శ్రీనివాస్ నటించే సినిమాను కూడా ఈ బ్యానర్ లోకి తీసుకువస్తారని తెలుస్తోంది.
నిర్మాణం అంతా రాజీవ్ రెడ్డి చూసుకుంటారని, కంటెంట్ క్వాలిటీ అంతా క్రిష్, చూసుకుంటారని, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారం దిల్ రాజు, యువి వంశీ చూసుకుంటారని తెలుస్తోంది.