బుద్దందా..గుడికి దగ్గరా..అని హీరోయిన్ సమంత కరుగ్గా అడిగింది. అంతవరకు ఓకె. సరైన టైమ్ లో రిపోర్టర్ క్వశ్చను అడగలేదు అని సరిపెట్టుకోవచ్చు.
కానీ నో పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్ అని కండిషన్ పెట్టి మరీ ఇంటర్వూలు ఇస్తున్నారు నాగ్ చైతన్య. మరి ఇది మరింత క్యూరియాసిటీ జనరేట్ చేయదా?
సెలబ్రిటీలు పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం అంటాడు శ్రీశ్రీ. మరీ అలాఅని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకపోయినా, రీడింగ్ ఇన్ బిట్వీన్ ది లైన్స్ అన్నట్లుగా, సమంత పోస్టులను, సమంత వైఖరికి అబ్జర్వ్ చేస్తూ వార్తలు రాస్తోంది మీడియా. ఈ వార్తలు వాస్తవం కాదని చాటి చెప్పాల్సిన పనీ లేదు.
ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన అవసరమూ లేదు. కానీ చైతన్య-సాయిపల్లవిల లవ్ స్టోరీ సినిమా ఫంక్షన్ కు హాజరుకావడం ద్వారా తాము ఒక్కటే అని, వినవస్తున్నవన్నీ అవాస్తవాలనీ చెప్పకనే చెప్పేయచ్చు.
కానీ ఆ పని సమంత చేస్తుందా? ఏమో? లేదా తిరుపతిలోనే మా ఆయన సినిమా విజయం కావాలని కోరుకోవడానికి తిరుపతి వచ్చా అని ఒక్క లైన్ సమాధానం చెప్పి వున్నా వేరుగా వుండేది వ్యవహారం.