మంత్రి పదవులు పోయినోళ్లకు ఎన్నికల బాధ్యతలు …!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మార్పులు చేతులు చేయడం గ్యారంటీ. అయితే అది ఎప్పుడు జరుగుతుందనేది ఇంకా స్పష్టంగా తెలియదు. వాస్తవానికి మరికొన్ని రోజుల్లో ఈ పని చేయాల్సి ఉంది. కానీ మరో…

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మార్పులు చేతులు చేయడం గ్యారంటీ. అయితే అది ఎప్పుడు జరుగుతుందనేది ఇంకా స్పష్టంగా తెలియదు. వాస్తవానికి మరికొన్ని రోజుల్లో ఈ పని చేయాల్సి ఉంది. కానీ మరో ఆరు నెలల తరువాత చేయాలనుకుంటున్నట్లుగా సమాచారం వస్తోంది. జగన్ ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి పోరు కాబట్టి ఏదో ఒక రోజు జరుగుతుంది.

ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లో ఉన్న ప్రస్తుత మంత్రులు తమ పదవులు ఉంటాయో, ఊడతాయోనని ఆందోళన పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరుంటారు.. ఎవరు ఉండరో అని లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. పనితీరు ఆధారంగానే మార్పులు చేర్పులు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. 

మంత్రివర్గ విస్తరణ ఉంటుందా.. పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తారా, లేదా అని పార్టీలో చర్చించుకుంటున్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుండే జగన్ కసరత్తు ప్రారంభించారు. 2019  ఫలితాలే సాధించాలనే పట్టుదలతో ఉన్నారు వైసీపీ అధినేత. అందుకే త్వరలో జరగబోయే మంత్రివర్గ మార్పులు పకడ్బందీగా చేయాలని ఆలోచిస్తున్నారు. కొత్తగా ఏర్పడబోయే మంత్రివర్గం ఎన్నికల మంత్రివర్గంగా ఉంటుంది కాబట్టి అన్ని కోణాల నుంచి ఆలోచించి మార్పులు చేయాల్సి ఉంటుంది.

తేడాలొస్తే ఆ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉంటుంది. మంత్రి పదవులు పోయినవారికి బాధగానే ఉంటుంది. అయినప్పటికీ వారు ఉత్సాహంగా ఉండక తప్పదు. 

ఎందుకంటే మంత్రి పదవులు పోయిన వాళ్లకు ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తారట జగన్. ఇదే విషయాన్ని ప్రకటించారు మంత్రి పేర్నినాని. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 20 శాతం కొనసాగుతారని, 80 శాతం మందిని తప్పించి పార్టీ భాద్యతలు అప్పగిస్తారన్న సంకేతాలు ఇచ్చారు పేర్ని నాని.

దీంతో మంత్రివర్గ విస్తరణా? లేక పూర్తిస్థాయిలో ప్రక్షాళన అన్నదానిపై త్వరలో క్లారిటీ వస్తుంది. . వచ్చే సంవత్సరం సంక్రాంతి నాటికి కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంటడం మాత్రం ఖాయంగా కనిపిస్తోందని వైసీపీలో చర్చించుకుంటున్నారు.