సాహో కష్టం చూస్తే బాధేస్తుంది

దాదాపు తొమ్మిది నిమిషాల వీడియో. మూడు గంటల సాహోలోని యాక్షన్ సీక్వెన్స్ ల కోసం వందలాది మంది సభ్యుల యూనిట్ పడిన కష్టాన్ని చూపించే వీడియో. ఈ వీడియోను సాహో మేకర్లు ఈరోజు యూట్యూబ్…

దాదాపు తొమ్మిది నిమిషాల వీడియో. మూడు గంటల సాహోలోని యాక్షన్ సీక్వెన్స్ ల కోసం వందలాది మంది సభ్యుల యూనిట్ పడిన కష్టాన్ని చూపించే వీడియో. ఈ వీడియోను సాహో మేకర్లు ఈరోజు యూట్యూబ్ లో విడుదల చేసారు. సాహో సినిమా విశేషాలు ఇప్పటికే తెలుసు. దానికోసం ఎంత ఖర్చు చేసారో? విదేశాల్లో తీసిన యాక్షన్ సీన్ల కోసం ఎన్ని భారీ వాహనాలు తయారు చేసారో, అన్నీ తెలుసు. ఇప్పుడు ఆ విషయాలు ఎట్ ఎ గ్లాన్స్ అలా అలా చూస్తుంటే, ఆ కష్టం తెలుస్తోంది.

బోలెడు మంది నిపుణులు, వేలాది గంటల పనిదినాలు, ఆలోచనలు, విజువలైజేషన్, గ్రాఫిక్స్ వర్క్, అన్నింటికి మించి కోట్ల ఖర్చు ఇవన్నీ క్లియర్ గా కనిపిస్తున్నాయి ఆ మేకింగ్ వీడియోలో. వీడియోలు షాట్స్ అన్నీ చూస్తుంటే, సాహో చూడాలనే ఆసక్తి పెంచేలా వున్నాయి. కానీ ఇప్పటికే జనాలు ఆ సినిమా చూసేసారు.

అందువల్ల ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే, ఆ షాట్స్ ప్రెజెంట్ చేసిన తీరు, దానిచుట్టూ అల్లకున్న కథ, దాన్ని వివరించిన తీరు గుర్తుకువచ్చి బాధేస్తుంది. ఇంత మంచి టెక్నికల్ వర్క్ వృధా అయిందే అన్న ఆలోచన కలుగుతుంది. మొత్తంమీద సాహో సినిమాను మరోసారి గుర్తు చేయడంలో మాత్రం సక్సెస్ అయింది ఈ మేకింగ్ వీడియో.