పవన్ కల్యాణ్, వీహెచ్.. సెన్షేషనల్ కాంబో!

గతంలోనే వీహెచ్ మీద మమకారాన్ని చాటుకున్నారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. వీ.హనుమంతరావును తెలంగాణ సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే ఆ పార్టీకి తన మద్దతు ఉంటుందని అప్పట్లో ఓపెన్ ఆఫర్ ఇచ్చారు…

గతంలోనే వీహెచ్ మీద మమకారాన్ని చాటుకున్నారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. వీ.హనుమంతరావును తెలంగాణ సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే ఆ పార్టీకి తన మద్దతు ఉంటుందని అప్పట్లో ఓపెన్ ఆఫర్ ఇచ్చారు పవన్ కల్యాణ్. అయితే కాంగ్రెస్ పార్టీ ఆ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకోలేదు!

ఎమ్మెల్యేగా గెలవలేని వీహెచ్ కు రెండుచోట్ల ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయే రేంజ్ ఉన్న పవన్ కల్యాణ్ అప్పట్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తెలంగాణలో తన మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఫ్రీ అని అప్పట్లో పవన్ కల్యాణ్ ప్రకటించారు.

పవన్ కల్యాణ్ అలా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిగా వీహెచ్ ను ప్రొజెక్ట్ చేసినా, తెలంగాణ జనాలు మాత్రం వీహెచ్ ను ఎమ్మెల్యేగా పోటీచేస్తే ఓడించారు. పవన్ ను ఏపీ జనాలు కూడా ఓడించారనుకోండి. ఇప్పుడు విశేషం ఏమిటంటే.. ఈ అరివీరభయంకరులిద్దరూ ఒకే వేదిక మీదకు వచ్చారు.

కాంగ్రెస్ లో తనమాట వినేవాళ్ల ఎవ్వరూ లేకుండా పోయారని తరచూ వాపోతూ ఉండే హనుమంతరావు పవన్ కల్యాణ్ పార్టీ ఆఫీసుకు వెళ్లారు. ఆయనతో కలిసి ఖుషీ కనిపించారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఉమ్మడి ప్రకటనలు చేశారు.

నల్లమల ఫారెస్ట్ లో యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్టుగా ప్రకటించుకున్నారు. ఉద్యమం సంగతేమో కానీ.. పవన్ కల్యాణ్ ప్రతిపాదిత తెలంగాణ సీఎం అభ్యర్థి, జనసేన ఏపీ సీఎం అభ్యర్థి ఒకేవేదిక మీద కనిపించడం మాత్రం అరివీరభయంకరమైన స్థాయిలోనే ఉందని నెటిజన్లు గొణుక్కొంటున్నారు.

జగన్‌ పాలన.. 'హాఫ్‌' మార్కును చేరిన అభినందనలు