పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరు ఇప్పుడు విడాకుల వ్యవహారంలో నానుతోంది. ఆ పాకిస్తానీతో సానియా విడాకులు తీసుకోబోతోందనే ప్రచారం ముమ్మరంగా జరుగుతూ ఉంది. దీనికి కారణం షోయబ్ మాలిక్ వ్యవహార శైలే అని కూడా వార్తలు వస్తున్నాయి. ఒక మోడల్ తో మాలిక్ వ్యవహారాన్ని నడుపుతున్నాడనే ఇదే విడాకుల వరకూ తీసుకు వచ్చిందనే ప్రచారం జరుగుతూ ఉంది.
మరి ఈ ప్రచారం ముమ్మరంగానే జరుగుతున్నా… ఇరు వర్గాల నుంచి ఖండనలు లేకపోవడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సెలబ్రిటీలు అంతా బాగుంటే వెంటనే ఖండనలు వేయడమో లేక తమ బంధాన్ని చాటేలా సోషల్ మీడియాలో రియాక్ట్ కావడమో జరుగుతూ ఉంటుంది. అయితే సానియా- మాలిక్ ల మధ్య మాత్రం అంతా ముగిసిందని, మ్యూచువల్ కన్సెంట్ తో వీరు విడాకుల బాట పడుతున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది.
కానీ అధికారికంగా మాత్రం అలాంటి దాఖలాలు లేవు. పాకిస్తాన్ చట్టాల ప్రకారమే వీరు విడాకులు తీసుకుంటారు కాబోలు. అయితే.. వచ్చే రూమర్లన్నింటికీ సెలబ్రిటీలు రియాక్ట్ కావాల్సిన అవసరం లేకపోవచ్చు. అయితే.. మాలిక్ ఎఫైర్ గురించే ఇక్కడ హైలెట్ అవుతోంది. దీంతో విడాకుల ఊహాగానాలకు రెక్కలొస్తున్నాయి.
ఇక ఈ రూమర్లే నిజం అయితే సానియాపై కొంత ట్రోలింగ్ కూడా తప్పకపోవచ్చు. ఎందుకంటే ఆమె వివాహం సమయంలో కొంతమంది తెగ స్పందించేశారు. ఒక పాకిస్తాన్ ను ఎలా పెళ్లి చేసుకుంటావంటూ అప్పట్లో రచ్చ రచ్చ చేశారు. అందులోనూ అప్పట్లో సానియా ఒక ఎంగేజ్ మెంట్ ను రద్దు చేసుకుని మరీ మాలిక్ ను పెళ్లి చేసుకుంది. ఇన్నేళ్లూ కాపురం సాగినా.. అప్పుడు నిందించిన వాళ్లు, మేమేం అప్పుడే చెప్పామా.. అంటారంతే!